‘రావణుడికి సూర్పణకలా రాహుల్‌గాంధీకి ప్రియాంకా గాంధీ’.. బీజేపీ నేత వ్యాఖ్యల దుమారం

‘కలియుగంలో రాహుల్ గాంధీ కష్టాల్లో ఉన్నప్పుడు ప్రియాంకాగాంధీ వాద్రా సాయం తీసుకుంటున్నారు.’ అని గ్యాన్ దేవ్ ఆహుజా అన్నారు.

news18-telugu
Updated: March 29, 2019, 3:19 PM IST
‘రావణుడికి సూర్పణకలా రాహుల్‌గాంధీకి ప్రియాంకా గాంధీ’.. బీజేపీ నేత వ్యాఖ్యల దుమారం
రాహుల్ గాంధీతో కలిసి లక్నోలో ప్రియాంక గాంధీ మెగా ర్యాలీ(Photo: Congress/Twitter)
  • Share this:
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీ వాద్రా మీద రాజస్థాన్ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని రావణుడిలా, ప్రియాంకాగాంధీని సూర్పణకతో పోల్చారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రాజస్థాన్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గ్యాన్ దేవ్ ఆహుజా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపత్కాలంలో సోదరి సాయం తీసుకుంటున్నారని విమర్శించారు. అల్వార్‌లోని ముండాలో జరిగిన ఓ సమావేశంలో గ్యాన్ దేవ్ ఆహుజా మాట్లాడారు. ‘హిందూ పురాణాల ప్రకారం సత్యయుగంలో హిరణ్యకశిపుడు కష్టాల్లో పడినప్పుడు తన సోదరి హోలికా సాయం తీసుకున్నాడు. త్రేతాయుగంలో రావణుడు ఆపత్కాలంలో సోదరి సూర్పణక సాయం తీసుకున్నాడు. అలాగే, కలియుగంలో రాహుల్ గాంధీ కష్టాల్లో ఉన్నప్పుడు ప్రియాంకాగాంధీ వాద్రా సాయం తీసుకుంటున్నారు. అయితే, అప్పుడు హోలికా, సూర్పణకకు ఏమైందో అందరికీ తెలిసిందే’ అని అన్నారు.

రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ఇద్దరూ గుళ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిని ప్రధాని నరేంద్రమోదీ స‌‌‌ృష్టించారని ఆహుజా అన్నారు. ‘ఒకప్పుడు పూర్తి నాస్తికులుగా ఉన్నవారు ఇప్పుడు ఓట్ల కోసం దేవుడిని నమ్మడం మొదలు పెట్టారు. అయితే, వారి ట్రిక్స్‌‌ని ప్రజలు అంత సులువుగా నమ్మరు.’ అని ఆహూజా తెలిపారు. గతంలో కూడా ఔరంగజేబుతో మొఘల్ రాజ్యం అంతం అయిపోయినట్టు రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పని కథ ముగిసిపోతుందని వ్యాఖ్యానించారు.
First published: March 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading