సీడబ్ల్యూసీలో ఏమైంది? మధ్యలోనే వెళ్లిపోయిన సోనియా, రాహుల్

కొత్త చీఫ్ ను ఎన్నుకునే క్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 5 ఉప కమిటీలుగా విడిపోయింది. ఈ గ్రూపులకు సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, అహ్మద్ పటేల్ నాయకత్వం వహించనున్నట్లు సీడబ్ల్యూసీ తెలిపింది.

news18-telugu
Updated: August 10, 2019, 2:47 PM IST
సీడబ్ల్యూసీలో ఏమైంది? మధ్యలోనే వెళ్లిపోయిన సోనియా, రాహుల్
సోనియా, రాహుల్
  • Share this:

కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడి కోసం చాలా నెలలుగా కసరత్తు చేస్తోంది. దీంతో కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ఇవాళ ఢిల్లీలో సమావేశమైంది. ఈ కార్యక్రమానికి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు కూడా హాజరయ్యారు.  కొత్త చీఫ్ ను ఎన్నుకునే క్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 5 ఉప కమిటీలుగా విడిపోయింది. ఈ గ్రూపులకు సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, అహ్మద్ పటేల్ నాయకత్వం వహించనున్నట్లు సీడబ్ల్యూసీ తెలిపింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, నాయకులు, పీసీసీ అధ్యక్షులు అందరితోనూ సంప్రదింపులు జరిపి... అత్యున్నత పదవికి ఎవర్ని ఎంపిక చెయ్యాలో అభిప్రాయాలు తెలుసుకుంటారు.అయితే ఈ కమిటీల్లో తమ పేర్లను చేర్చడం పట్ల సోనియా, రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
అధ్యక్షుడి ఎన్నికపై తమ ప్రభావం పడే ఎలాంటి చర్య తమకు సమ్మతం కాదని వారు స్పష్టం చేశారు. అంతేకాదు... సమావేశం నుంచి వారిద్దరు నిష్క్రమించారు. కొత్త నాయకుడి ఎన్నికలో పారదర్శకత ఉండాలంటే తామిద్దరం ఎన్నిక ప్రక్రియకు దూరంగా ఉండడమే మంచిదని నిర్ణయించుకున్నారు, దీంతో సమావేశం మధ్యలోనే సోనియా, రాహుల్ బయటికి వచ్చేశారు.

First published: August 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading