రాజకీయ లబ్ది కోసం ఓ మనిషిని పాడె ఎక్కించేశారు : రాహుల్‌పై స్మృతీ ఇరానీ

పోలింగ్ వేళ రాహుల్ అమేథీలో కనిపించకపోవడంపై స్మృతీ ఇరానీ మండిపడ్డారు. రాహుల్ ఎక్కడికెళ్లారో.. అమేథీలో ఎందుకు కనిపించడం లేదో చెప్పాలన్నారు.

news18-telugu
Updated: May 6, 2019, 12:52 PM IST
రాజకీయ లబ్ది కోసం ఓ మనిషిని పాడె ఎక్కించేశారు : రాహుల్‌పై స్మృతీ ఇరానీ
స్మృతీ ఇరానీ (Image : ANI/Twitter)
  • Share this:
ఐదో విడత లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ రాహుల్ గాంధీపై తీవ్ర ఆరోపణలు చేశారు. అమేథీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లిన వ్యక్తిని బయటకు పంపించేశారని.. దాంతో సకాలంలో చికిత్స అందక అతను చనిపోయాడని అన్నారు. రాహుల్ గాంధీ ఆ ఆసుపత్రి ట్రస్ట్ మెంబర్‌గా ఉన్నారని.. పేషెంట్‌కి కేంద్రం అందించిన ఆయుష్మాన్ భారత్ కార్డు ఉండటం వల్లే చికిత్స నిరాకరించారని ఆరోపించారు. కేవలం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఓ అమాయకుడిని బలిచేశారని.. రాహుల్ గాంధీకి కనీస మానవత్వం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలింగ్ వేళ రాహుల్ అమేథీలో కనిపించకపోవడంపై స్మృతీ ఇరానీ మండిపడ్డారు. రాహుల్ ఎక్కడికెళ్లారో.. అమేథీలో ఎందుకు కనిపించడం లేదో చెప్పాలన్నారు. కనీసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకైనా రాహుల్ ఎందుకు రాలేదో చెప్పాలని అన్నారు. అంతేకాదు, అమేథీలోని కొన్ని పోలింగ్ బూత్‌లలో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని.. బూత్‌లను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు ప్రియాంక గాంధీపై కూడా ఆమె పలు విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల క్రితం తన పేరు కూడా తెలియని ప్రియాంక.. ఇవాళ ఆమె భర్త కంటే ఎక్కువగా తన పేరే తలుచుకుంటున్నారని సెటైర్ వేశారు.



Published by: Srinivas Mittapalli
First published: May 6, 2019, 11:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading