పుల్వామా ఉగ్రదాడిపై కేంద్రానికి రాహుల్ సూటి ప్రశ్నలు

Pulwama Attack Anniversary | పుల్వామా ఉగ్రదాడి ఘటనలో 40 మంది భారత జవాన్లు అమరులైన నేటితో ఏడాది పూర్తైన సందర్భంగా బీజేపీపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు.

news18-telugu
Updated: February 14, 2020, 2:27 PM IST
పుల్వామా ఉగ్రదాడిపై కేంద్రానికి రాహుల్ సూటి ప్రశ్నలు
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ(ఫైల్ ఫోటో)
  • Share this:
పుల్వామా ఉగ్రదాడి ఘటనతో ఎక్కువ ప్రయోజనం కలిగింది ఎవరంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా రాహుల్ ట్విట్టర్ వేదికగా బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనలో మరణించిన 40 మంది అమర జవాన్లకు రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్రానికి మూడు ప్రశ్నలు వేసిన రాహుల్ గాంధీ..పుల్వామా ఉగ్రదాడి ఘటనతో ఎక్కువగా లాభపడింది ఎవరు? అంటూ ప్రశ్నించారు. అలాగే ఈ ఘటనపై విచారణలో ఏం తేలింది? అని ప్రశ్నించారు. భద్రతా లోపాల వల్ల జరిగిన ఈ దాడికి బీజేపీ సర్కార్‌లోని ఎవరు బాధ్యతవహిస్తారు? అంటూ రాహుల్ గాంధీ మూడో ప్రశ్న వేశారు.
First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు