RAHUL GANDHI WROTE TO TWITTER CEO PARAG AGRAWAL OVER HIS FOLLOWER COUNT PVN
Rahul Vs Twitter : తగ్గిన రాహుల్ ట్విట్టర్ ఫాలోవర్స్..కారణం అదేనా!
రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో)
Rahul wrote to Twitter CEO : తన గొంతును నొక్కి పెట్టేందుకు ట్విట్టర్ ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రభుత్వ ఒత్తిడితో ట్విట్టర్ లో తన ఫాలోవర్ల సంఖ్యపై అప్రకటిత ఆంక్షలు విధిస్తున్నారని రాహుల్ ఆరోపించారు.
Rahul wrote to Twitter CEO : తన గొంతును నొక్కి పెట్టేందుకు ట్విట్టర్ ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రభుత్వ ఒత్తిడితో ట్విట్టర్ లో తన ఫాలోవర్ల సంఖ్యపై అప్రకటిత ఆంక్షలు విధిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. తన ఖాతా ఫాలోవర్లను ట్విట్టర్ కట్టడి చేస్తోందంటూ ఆరోపించిన రాహుల్.. ఈ మేరకు ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ కు గురువారం ఓ లేఖ రాశారు. ఈ లేఖలో తన ఫాలోవర్ల వివరాలను రాహుల్ తెలియజేశారు.
ట్విట్టర్ సీఈఓకి రాసిన లేఖలో రాహుల్..ట్విట్టర్ తనకు తెలియకుండానే పరోక్షంగా భావప్రకటన స్వేచ్ఛను హరిస్తోందని భావిస్తున్నాను. 2021 ఆగస్టులో నా ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత నుంచి ఫాలోవర్ల సంఖ్యను ట్విట్టర్ నియంత్రిస్తోంది. అంతకుముందు నెలకు 2.3 లక్షల మంది కొత్త ఫాలోవర్లు వచ్చే వారు. పలు సందర్భాల్లో ఈ సంఖ్య 6.5 లక్షలకు కూడా చేరింది. కానీ, ఆగస్టు 2021 నుంచి నెలకు దాదాపు 2,500 మంది కొత్త ఫాలోవర్లు తగ్గుతున్నారు. ఈ కాలంలో నా ఫాలోవర్లు 19.5 మిలియన్ల మంది వాస్తవంగా స్తంభించిపోయారు.
భారత్‌లో నిరంకుశత్వం పెరగడానికి ట్విట్టర్ సహాయపడకుండా చూసుకోవాల్సిన అపారమైన బాధ్యత మీపై ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉదారవాద ప్రజాస్వామ్యం, నిరంకుశత్వం మధ్య సైద్ధాంతిక యుద్ధం సోషల్ మీడియా వేదికగా రూపుదిద్దుకుంటోంది. ఇది ట్విటర్ వంటి సంస్థల సారథ్యంలో ఉన్న వారిపై మరింత బాధ్యతను ఉంచుతోంది’అని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు.
కేంద్రం ఒత్తిడి వల్లే ట్విట్టర్ సంస్థ ఈ చర్యలకు పాల్పడుతోందని రాహుల్ పేర్కొన్నారు. కాగా, గతేడాది ఆగస్టులో ఢిల్లీ అత్యాచార బాధిత కుటుంబం ఫోటోను రాహుల్ గాంధీ షేర్ ట్విట్టర్ లో షేర్ చేయడ వివాదస్పదమయ్యింది. బీజేపీ నేతల ఫిర్యాదు చేయడంతో చట్టాన్ని ఉల్లంఘించారని రాహుల్ ఖాతాను ట్విట్టర్ 8 రోజులు నిలిపివేసి ఆ తర్వాత పునరుద్దరించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి రాహుల్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది.
ఇక,రాహుల్ తాజా ఆరోపణలపై స్పందించిన ట్విట్టర్.. రాహుల్ ఖాతా ఫాలోవర్ల సంఖ్య సరిగ్గానే ఉందని పేర్కొంది. తమ ప్లాట్ఫామ్లో ఎటువంటి అవకతవకలు జరగవని, జీరో టాలరెన్స్ ఉంటుందని, స్పామ్ ఉండదని పేర్కొంది. నకిలీ ఖాతాలపై మాత్రం కఠిన చర్యలు చేపడుతున్నట్లు ట్విట్టర్ తెలిపింది. తమ ప్లాట్ఫామ్లో అవకతవకలకు పాల్పడే వారికి చెందిన మిలియన్ల అకౌంట్లను ప్రతి వారం డిలీట్ చేస్తూనే ఉంటామని ట్విట్టర్ చెప్పింది. ఈ క్రమంలోనే ఫాలోవర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం రాహుల్ ట్విట్టర్ ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య 19.6 మిలియన్లుగా ఉంది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.