• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • RAHUL GANDHI TWEETS PHOTOS OF PM MODI IN CORBETT CALLS HIM PRIME TIME MINISTER BJP HITS BACK MS

పుల్వామా దాడి రోజు షూటింగ్‌లో మోదీ.. ఇదిగో ఫోటోలు..: రాహుల్

పుల్వామా దాడి రోజు షూటింగ్‌లో మోదీ.. ఇదిగో ఫోటోలు..: రాహుల్

ట్విట్టర్‌లో రాహుల్ పోస్ట్ చేసిన మోదీ ఫోటో షూట్ ఫోటోలు(Image: Twitter)

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోదీ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. జవాన్ల మృతి వార్త తెలిసి దేశమంతా విచారంలో మునిగిపోతే.. మోదీ మాత్రం ఫోటో షూట్‌లో గడిపారని మండిపడ్డారు.

  • Share this:
    పుల్వామాలో భారత సైనికులపై ఆత్మాహుతి దాడి జరిగిన రోజు.. ప్రధాని మోదీ ఓ డాక్యుమెంటరీ షూటింగ్‌లో పాల్గొన్నారని కాంగ్రెస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దాడి విషయం తెలిసి కూడా మోదీ అంత కూల్‌గా షూట్‌లో ఎలా పాల్గొన్నారని ఆ పార్టీ దుయ్యబడుతోంది. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోదీ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. జవాన్ల మృతి వార్త తెలిసి దేశమంతా విచారంలో మునిగిపోతే.. మోదీ మాత్రం ఫోటోషూట్‌లో గడిపారని మండిపడ్డారు.

    దేశ ప్రజల గుండెల్లో దు:ఖపు నదులు ఉప్పొంగుతున్నవేళ.. మోదీ మాత్రం ఓ నది ఒడ్డున నిలబడి నవ్వుతూ ఫోటోషూట్‌లో పాల్గొన్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. మరోవైపు రాహుల్ ట్వీట్స్‌పై స్పందించిన బీజేపీ మాత్రం దీన్ని ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది.

    కాగా, ఫిబ్రవరి 14న పుల్వామా దాడి జరిగిన రోజు ప్రధాని మోదీ ఉత్తరాఖండ్‌లో పర్యటించారు. ఆ సందర్భంగా జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్కును సందర్శించిన ఆయన డిస్కవరీ ఛానెల్ డాక్యుమెంటరీ షూటింగ్‌లో పాల్గొన్నారు. దాదాపు నాలుగు గంటలు ఆయన షూట్‌లో పాల్గొన్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పుల్వామా దాడి వార్త తెలిశాక కూడా మోదీ ఫోటోషూట్ నుంచి కదల్లేదని రాహుల్ తాజాగా ఆరోపించారు.



    ఇది కూడా చదవండి : ఓవైపు పుల్వామా దాడి.. మరోవైపు షూటింగ్‌లో మోదీ బిజీ : కాంగ్రెస్
    First published:

    అగ్ర కథనాలు