ఏపీ టూర్‌కు రాహుల్ గాంధీ.. నేడు తిరుమల వెంకన్న దర్శనం

రాహుల్ గాంధీ (File)

Rahul Gandhi | తిరుమల వెంకన్న సాక్షిగా ఏపీ ప్రత్యేక హోదా ఇస్తామన్న మోదీ మాట తప్పారని రాహుల్ గాంధీ ప్రముఖంగా ప్రస్తావించనున్నారు.

  • Share this:
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు ఏపీలో పర్యటించనున్నారు.  కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు ఆయన ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఢిల్లీ నుంచి ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తిరుమల వెళతారు. అక్కడ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత తిరిగి తిరుపతికి చేరుకుంటారు. అక్కడ తారకరామ స్టేడియంలో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్ధేశించి ప్రసంగిస్తారు.

Rahul Gandhi, Farm Loan waiver for All, farm loan waiver, rahul gandhi in patna, Congress Patna Rally, రైతులు అందరికీ రుణమాఫీ, నగదు బదిలీకి రాహుల్ కౌంటర్, రాహుల్ గాంధీ పాట్నా సభ, కాంగ్రెస్ పార్టీ పాట్నా సభ, Kisan Samman Nidhi, కిసాన్ సమ్మాన్ నిధి,
రాహుల్ గాంధీ(File)


జాతీయస్థాయిలో టీడీపీ‌తో కలసి పనిచేయడానికి సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ.. స్థానికంగా మాత్రం సొంతంగానే పోటీ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒంటరిపోరాటం చేయనుంది. పార్టీని బలోపేతం చేయడం కోసం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మరికొందరు నేతలు బస్సుయాత్రను చేపట్టారు. కొన్ని రోజుల క్రితం మొదలైన ఈ బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు సాగుతోంది.

PMO involved in Rafale deal, PMO Rafale deal, PM Modi negotiated Rafale deal, Rafale deal news, Rahul Gandhi News, Rahul Gandhi latest on Rafale, రాఫెల్ డీల్ న్యూస్, రాఫెల్ యుద్ధ విమానం, పీఎంఓ మధ్యవర్తిత్వం, రాఫెల్ డీల్ పీఎంఓ, ప్రధాని నరేంద్ర మోదీ రాఫెల్ డీల్, నరేంద్ర మోదీ రాఫెల్ డీల్, రాఫెల్ డీల్లో నరేంద్ర మోదీ
రాహుల్ గాంధీ


2014 ఎన్నికల సమయంలో తిరుపతిలో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ చెప్పారు. అయితే, స్పెషల్ స్టేటస్ రాలేదు. దీంతో తిరుపతి సాక్షిగా మాట ఇచ్చిన మోదీని మళ్లీ తిరుపతిలోనే టార్గెట్ చేయనున్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని రాహుల్ గాంధీ చెబుతున్నారు. ఇటీవల దుబాయ్ పర్యటనలో కూడా ఆయన ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.
First published: