Home /News /politics /

RAHUL GANDHI TO VISIT AMETHI AFTER 2 YEARS CONGRESS LEADER TO KICK START UP CAMPAIGN FROM AMETHI ON DECEMBER 18 MKS

Amethi: పోగొట్టుకున్న చోటే వెతుకులాట -రెండేళ్ల తర్వాత అమేథీకి Rahul Gandhi

అమేథీలో రాహుల్ గాంధీ(పాత ఫొటో)

అమేథీలో రాహుల్ గాంధీ(పాత ఫొటో)

స్మృతి ఇరానీ చేతిలో ఘోరపరాజయం తర్వాత అటుగా కన్నెత్తి చూడని రాహుల్.. ఇప్పుడు అదే అమేథీ నుంచే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ పేరు దాదాపు ఖరారైందనే ప్రచారం నేపథ్యంలో మళ్లీ ఆయన సొంత గడ్డకు పోతుండటం..

ఇంకా చదవండి ...
వ్యక్తిత్వ వికాసం కొత్త పుంతలు తొక్కుతోన్న ఈరోజుల్లోనూ పొగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే పాత సామెతకు ప్రాధాన్యం తగ్గలేదు. ఏ కాంగ్రెస్ కంచుకోటనైతే బీజేపీ బద్దలు కొట్టిందో.. గాంధీ-నెహ్రూ పరివార వారసుడు ఎక్కడైన మట్టికరిచాడో మళ్లీ అక్కడి నుంచే పునరుజ్జీవన ప్రయత్నాలు మొదలుకానున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన పాత సొంత నియోజకవర్గమైన అమేథీకి వెళ్లనున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ స్మృతి ఇరానీ చేతిలో ఘోరపరాజయం తర్వాత అటుగా కన్నెత్తి చూడని రాహుల్.. ఇప్పుడు అదే అమేథీ నుంచే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ పేరు దాదాపు ఖరారైందనే ప్రచారం నేపథ్యంలో మళ్లీ ఆయన సొంత గడ్డకు పోతుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

నెహ్రూ జమానా నుంచి యూపీలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉండిన అమేథీ నియోజకవర్గంలో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల తర్వాత రాహుల్ గాంధీ వరుసగా రెండు సార్లు గెలిచారు. కానీ రెండేళ్ల కిందటి ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా ఓడిపోయారు. అదృష్టమో, ముందుచూపో, కేరళలోని వయనాడ్ నుంచి కూడా రాహుల్ పోటీ చేయడం, అమేథీలో ఓడినా, వయనాడ్ లో గెలవడం ద్వారా ఎంపీగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ లో రెండేళ్లుగా కొనసాగుతోన్న ప్రతిష్టంభనకు తెరదించుతూ మళ్లీ రాహుల్ గాంధీనే అధ్యక్షుడు కాబోతున్నారనే ప్రచారం ఊపందుకున్న సమయంలోనే కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నుంచి ఓ అధికారిక ప్రకటన వెలువడింది..

Explained: కాశీ విశ్వనాథ్ కారిడార్ అంటే ఏంటి? ఇది pm modi డ్రీమ్ ప్రాజెక్ట్ ఎందుకైంది?కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈనెల 18న అమేథీ వెళ్లనున్నారు. రెండేళ్ల తర్వత ఆయనక్కడ అడుగుపెట్టనుండటం ఇదే తొలిసారి. వచ్చేఏడాది ఫిబ్రవరి-మార్చిలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దరిమిలా అమేథీ నుంచే రాహుల్ తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బీజేపీ పాలనతో పెట్రో, నిత్యావసరాల అధిక ధరలకు వ్యతిరేకంగా డిసెంబర్ 18న రాహుల్ అమేథీలో పాదయాత్ర చేయనున్నారు. ఆ యాత్ర ద్వారానే రాహుల్ ఎన్నికల ప్రచారం షురూ అవుతుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 12న జైపూర్ సభలో పాల్గొన్న రాహుల్, 16న డెహ్రాడూన్ సభతో ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు.

Hyderabad : శిల్పా చౌదరికి మళ్లీ షాక్ -ఆ పనికి భర్తను వాడుకోలేదా? -కోర్టు అనూహ్య తీర్పుఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఇంచార్జిగా ఉన్న ప్రియాంక గాంధీ ఇప్పటికే విస్తృతంగా పర్యటిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 18న రాహుల్ అమేథీలో చేయబోయే పాదయాత్రలో ప్రియాంక కూడా పాల్గొంటారని తెలిసింది. ప్రస్తుత యూపీ ఎన్నికల్లో యోగి సారధ్యంలోని బీజేపీ ఓవైపు, సమాజ్ వాదీ చీఫ్ అఖిలేశ్ యాకత్వంలో ఆర్ఎల్డీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), భాగీదారి సంకల్ప్ మోర్చా(బీఎస్ఎం)తో పొత్తు కుదుర్చుకొని, చంద్రశేఖర్ రావణ్ తోనూ పొత్తుకు ప్రయత్నిస్తోన్న కూటమి మరోవైపు, మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ ఇంకోవైపు.. ఇలా త్రిముఖ పోరు నెలకొన్న యూపీలో కాంగ్రెస్ ఒటరిగా బరిలోకి దిగుతోంది. ప్రియాంక ఛరిష్మాతో కాంగ్రెస్.. యూపీ ఎన్నికలను చతుర్ముఖ పోరుగా మార్చుతుందా లేక పాత ఫలితాలే వస్తాయా అనేది వేచి చూడాలి..
Published by:Madhu Kota
First published:

Tags: Congress, Rahul Gandhi, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు