Home /News /politics /

RAHUL GANDHI TO TAKE THE CONGRESS PRESIDENT POST ON OR BEFORE SEPTEMBER 2022 AK

మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు కానున్న Rahul Gandhi.. ముహూర్తం ఫిక్స్ ?

రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో )

రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో )

Congress: కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ అంగీకరించారని.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ పట్టాభిషేకం కేవలం లాంఛనమేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

    ఓ వైపు బీజేపీ వరుస విజయాలతో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ మాత్రం నాయకత్వ సమస్యతో ఇబ్బందిపడుతోంది. ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన తరువాత.. కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి దక్కుతాయనే దానిపై పార్టీలోనూ పెద్ద చర్చ జరిగింది. చివరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా మళ్లీ సోనియాగాంధీ పార్టీ పగ్గాలు తీసుకున్నారు. పార్టీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలనే దానిపై ఎన్నికలు నిర్వహిస్తామని అప్పట్లో ప్రకటించారు. కానీ ఇందుకు సంబంధించిన ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. అయితే తాజాగా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు రాహుల్ గాంధీ తీసుకునే విషయంలో స్పష్టత వచ్చింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

    సెప్టెంబరు నాటికి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని సోనియా గాంధీతో సమావేశమైన అనంతరం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల ప్రాధికార సంస్థ అధ్యక్షుడు మధుసూదన్ మిస్త్రీ తెలిపారు. మరోవైపు రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనుంది. 2024లో కొత్త అధ్యక్షుడి సారథ్యంలో ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ భావిస్తోంది.

    కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ అంగీకరించారని.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ పట్టాభిషేకం కేవలం లాంఛనమేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాహుల్‌గాంధీకి వ్యతిరేకంగా పార్టీకి చెందిన ముఖ్యనేతలు పోటీ చేసే అవకాశం లేదని.. ఎవరైనా అలా చేసినా.. ఎన్నికలు వచ్చినా రాహుల్‌ గాంధీ అధ్యక్షుడవడం ఖాయమని పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ మంగళవారం సోనియా గాంధీకి ఎన్నికల ప్రక్రియ పురోగతి నివేదికను సమర్పించారు. వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నికుంటామని మిస్త్రీ పేర్కొన్నారు.

    Revanth reddy : సన్నాసుల బండారం బయటపెడతామంటే అరెస్ట్ చేస్తారా...? ఎర్రవల్లి ఏమైనా... పాకిస్తాన్‌లో ఉందా...?

    Telangana: కేసీఆర్‌ను టార్గెట్ చేసే విషయంలో రేవంత్ రెడ్డి ప్లాన్ సక్సెస్ అవుతుందా ?

    కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించిన గడువులోగా ఎన్నికల పనులు పూర్తవుతాయని అన్నారు. మార్చి 31లోగా సభ్యత్వం ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత సోనియా గాంధీని తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించారు. కరోనా కారణంగా పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ కోసం మరింత గడువును పార్టీ నిర్ణయించింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Rahul Gandhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు