మళ్లీ రాహుల్ గాంధీకే కాంగ్రెస్ పగ్గాలు..!

Rahul Gandhi : జనవరి రెండో వారంలోనే రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలను అందుకుంటారని కూడా వార్తలు వస్తున్నాయి. రాహుల్‌ను ఎన్నుకొనేందుకే ఏఐసీసీ సమావేశాలు నిర్వహించబోతున్నట్లు సమాచారం.

news18-telugu
Updated: December 7, 2019, 4:12 PM IST
మళ్లీ రాహుల్ గాంధీకే కాంగ్రెస్ పగ్గాలు..!
రాహుల్ గాంధీ (File Photo)
  • Share this:
Rahul Gandhi : గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ రాజీనామాను వెనక్కి తీసుకోవాలని పార్టీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు ఎంత వేడుకున్నా ఆయన వెనక్కి తగ్గలేదు. రాఫెల్ ఒప్పందం సహా ఇంకొన్ని ఘటనలను లేవనెత్తుతూ బీజేపీని టార్గెట్ చేశారు. అయితే.. మోదీ మేనియా ముందు అవేవీ ఫలించలేదు. పైగా, రివర్స్ కావడంతో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఇది మింగుడు పడని రాహుల్ గాంధీ పదవికి రాజీనామా చేసేశారు. దీంతో అనారోగ్యంతో బాధపడుతున్నా సోనియా గాంధీనే మళ్లీ తాత్కాళిక అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే.. ఆమె మునుపటిలా చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆమె రాజకీయ వ్యవహారాలపై అంతగా ఫోకస్ చేయలేకపోతున్నారు. ఈ మధ్య ఆమె కొన్ని రోడ్ ‌షోలు, సభల్లో పాల్గొన్నా అంతలా ఆకట్టుకోలేకపోయారు.

ఈ నేపథ్యంలో ఎవరు తదుపరి కాంగ్రెస్ పగ్గాలు అందుకుంటారని చర్చ జరుగుతోంది. అయితే.. ఈ మధ్య పార్టీ సీనియర్లతో జరిగిన భేటీలో సోనియా ఈ అంశాన్ని లేవనెత్తగా.. అందరూ రాహుల్ గాంధీ పేరునే ప్రస్తావించినట్లు తెలిసింది. 2017 నుంచి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆ పార్టీ నుంచి చేజారుతూ వచ్చాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు కమలం పార్టీ చేజార్చుకుంది.

దీన్ని బట్టి మోదీ మేనియా, బీజేపీ ప్రభావం తగ్గుతున్నట్లే కనిపిస్తోందని, కాంగ్రెస్ పుంజుకోవడానికి సరైన సమయం ఇదేనని.. రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి 2024 నాటికి పార్టీకి అధికారం కట్టబెట్టే దిశగా అడుగులు వేస్తే ఫలితం ఉంటుందని పార్టీ సీనియర్ నేతలు సోనియాకు వివరించినట్లు సమాచారం. సోనియా కూడా వారి అభిప్రాయంతో ఏకీభవించినట్లు, కుమారుడిని ఒప్పించేందుకు ఆమె రెడీ అయినట్లు తెలుస్తోంది.

అంతేకాదు.. జనవరి రెండో వారంలోనే రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలను అందుకుంటారని కూడా వార్తలు వస్తున్నాయి. రాహుల్‌ను ఎన్నుకొనేందుకే ఏఐసీసీ సమావేశాలు నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ఊతం ఇస్తున్నాయి. ‘దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీకి ఆయన నాయకత్వం అవసరం వచ్చింది. పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. వారి అభ్యర్థనను రాహుల్ వింటారని ఆశిస్తున్నా’ అని కేసీ వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

First published: December 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>