HOME »NEWS »POLITICS »rahul gandhi to contest from wayanad official announcement soon ba

అమేథీతో పాటు దక్షిణాదిలో ఆ సీటు నుంచి రాహుల్ గాంధీ పోటీ?

అమేథీతో పాటు దక్షిణాదిలో ఆ సీటు నుంచి రాహుల్ గాంధీ పోటీ?
రాహుల్ గాంధీ (File)

వయనాడ్ నుంచి బరిలో దిగాల్సిందిగా కేపీసీసీ విన్నపాన్ని రాహుల్ గాంధీ చెవిన వేశామని కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ తెలిపారు.

  • Share this:
    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తారని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించిన జాబితాలో ధ్రువీకరించారు. అయితే, రాహుల్ గాంధీ దక్షిణాది నుంచి రెండో స్థానంలో బరిలోకి దిగాలని హస్తం నేతలు కోరుతున్నారు. ఈ క్రమంలో కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయొచ్చంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడడమే తరువాయి అని చర్చ జరుగుతోంది. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీని పోటీ చేయాల్సిందిగా కేపీసీసీ నేతలు అధ్యక్షుడికి విన్నవించారు. దీనిపై త్వరలోనే రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

    వయనాడ్ నుంచి బరిలో దిగాల్సిందిగా కేపీసీసీ కోరికను రాహుల్ గాంధీ చెవిన వేశామని కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ తెలిపారు. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి బరిలో దిగాలని ఆశిస్తున్నట్టు కేరళలో ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల అన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ పెద్దలు కేసీ వేణుగోపాల్, ఏకే ఆంటోనీ, ముకుల్ వాస్నిక్‌తో చర్చించినట్టు తెలిపారు. కేరళలోని యూడీఎఫ్ పక్షాలు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తే బావుంటుందని ఆశిస్తున్నాయి.



    వయనాడ్‌ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే తాను తప్పుకుంటానని టి.సిద్ధికీ తెలిపారు. రాహుల్ గాంధీ నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని యూడీఎఫ్ పక్షాలు ఎదురుచూస్తున్నాయి. దీనిపై ఏ క్షణంలో అయినా రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకోనున్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయాలంటూ ఫేస్ బుక్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలు వీటీ బలరాం, కేఏ షాజీలు ఫేస్ బుక్‌లో రిక్వెస్ట్‌లు కూడా పెట్టారు.
    First published:March 23, 2019, 14:39 IST

    टॉप स्टोरीज