మోదీకి అన్ని దారులు మూసేశాం... బీజేపీ ఓటమిపై రాహుల్ గాంధీ ధీమా

ఎన్నికల ఫలితాల అనంతరం మోదీ అధికారం కోల్పోవడం ఖాయమని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తరువాత కాంగ్రెస్ పాత్ర ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని తాను ఇప్పుడే చెప్పలేనన్న రాహుల్ గాంధీ... ఫలితాల కోసం అంతా మరికొద్ది రోజులు ఆగాలని సూచించారు.

news18-telugu
Updated: May 17, 2019, 5:30 PM IST
మోదీకి అన్ని దారులు మూసేశాం... బీజేపీ ఓటమిపై రాహుల్ గాంధీ ధీమా
రాహుల్ గాంధీ (File)
news18-telugu
Updated: May 17, 2019, 5:30 PM IST
ప్రధాని నరేంద్రమోదీ తన ఐదేళ్ల పాలనలో అన్ని రంగాల్లో విఫలమయ్యారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. అమిత్ షాతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ మీడియా ముందుకు రావడం సంతోషకరమని ఎద్దేవా చేశారు. ఈసీ ఈ ఎన్నికల్లో పక్షపాతంగా వ్యవహరించింది రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఎన్నికల షెడ్యూల్ కూడా మోదీకి అనుకూలంగా తయారు చేసినట్టు అనిపించిందని అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం మోదీ అధికారం కోల్పోవడం ఖాయమని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తరువాత కాంగ్రెస్ పాత్ర ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని తాను ఇప్పుడే చెప్పలేనన్న రాహుల్ గాంధీ... ఫలితాల కోసం అంతా మరికొద్ది రోజులు ఆగాలని సూచించారు.

ఎన్నికల తరువాత సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీకి తన సేవలు కొనసాగిస్తారని రాహుల్ గాంధీ అన్నారు. సోనియాతో పాటు కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ల సేవలన్నింటిని వినియోగించుకుంటామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మోదీ తరహాలో తాము సీనియర్లను పక్కనపెట్టబోమని అన్నారు. ప్రజలు తీర్పును తాము శిరసావహిస్తామని అన్నారు. తనను, తన కుటుంబాన్ని విమర్శించేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఆసక్తి చూపిస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. మోదీ తీరును ఆయన విచక్షణకే వదిలేస్తున్నానని తెలిపారు. తాము మళ్లీ మోదీ అధికారంలోకి రాకుండా అన్ని దారులు మూసేశామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...