దేశంలో ఆరోవిడత ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇవాళే ఆఖరి రోజు కావడంతో అన్ని పార్టీలు ముమ్మరం చేశాయి. ప్రత్యర్థి పార్టీల నేతలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఢిల్లీ సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విపక్ష పార్టీలకు రాహుల్ గాంధీ హాని తలపెడుతున్నారని..నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అయితే..దానికి రాహుల్ గాంధీయే బాధ్యత వహించాలని విరుచుకుపడ్డారు. PTI వార్తా సంస్థతో మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమాద్మీ మధ్య పొత్తు ప్రయత్నాలు జరిగాయి. పలు దఫాలుగా చర్చలు జరిగినా అవి ఫలించలేదు. దాంతో రెండు పార్టీలు వేర్వేరుగానే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్నాయి. తమ పొత్తు ఏర్పడపోవడానికి కారణం రాహుల్ గాంధీయే కారణమంటూ ఆప్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో కాంగ్రెస్ టార్గెట్‌గా విమర్శలను తీవ్రతరం చేశారు కేజ్రీవాల్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AAP, Arvind Kejriwal, Bjp, Congress, Delhi, Delhi Lok Sabha Elections 2019, New Delhi, Pm modi, Rahul Gandhi