news18-telugu
Updated: March 31, 2019, 11:43 AM IST
రాహుల్, స్మృతి ఇరానీ (File)
లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. అమేథితో పాటు... కేరళలోని వాయనాడ్ ప్రాంతం నుంచి కూడా ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగాలని రాహుల్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత అంటోని ప్రకటన విడుదల చేశారు. అంతా అనుకున్నట్లుగాగానే వాయనాడ్ నుంచి కూడా రాహుల్ పోటీకి దిగుతున్నారని తెలిపారు. రెండులోక్సభ స్థానాల నుంచి రాహుల్ పోటీ చేస్తున్నారన్న వార్తలు విని ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలతో పాటు. ఇతర రాజకీయ నేతలు కూడా షాక్ అయ్యారు. అయితే రాహుల్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం మాత్రం స్మృతీ ఇరానీయే. అమేథీ నుంచీ రెండోసారి బరిలో దిగిన ఆమె... అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. రాహుల్ గాంధీని ఎందుకూ పనికి రాని నేతగా చిత్రీకరిస్తున్నారు. అసలు రాహుల్ ఇన్నాళ్లూ అమేథీకి ఏమీ చెయ్యలేదని అపర కాళికలా విరుచుకుపడుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో స్మృతి ఇరానికి కౌంటర్ ఇవ్వాల్సిన రాహుల్... జాతీయస్థాయిలో పార్టీ పనులు, వివిధ రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యారు. అందువల్ల ఆయన అమేథీలో ప్రచారం చెయ్యలేకపోతున్నారు. దీంతో అమేథిలో ఎక్కడ ఓటమి చూడాల్సి వస్తుందోనన్న భయంతోనే రాహుల్ కేరళలోని వాయనాడ్‌లో కూడా పోటీకి దిగాలని పార్టీకి చెందిన కొంతమంది సీనియర్లు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. మరోవైపు స్మృతి ఇరానీ... ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత గ్రాఫ్‌ని పెంచుకుంటూ పోతున్నారు. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా రాహుల్‌ను వదలకుడా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా భాగ్ రాహుల్ భాగ్ అంటూ అమేథిలో ఆమె కొత్త స్లోగన్ కూడా అందుకున్నారు. ఇప్పుడు రాహుల్‌ని ఓడిస్తే, అదే సమయంలో బీజేపీ అధికారంలోకి వస్తే... ఆమె తిరుగులేని శక్తిగా గుర్తింపు పొందుతారు. కేబినెట్లో కీలక మంత్రిత్వ పదవులు పొందే ఛాన్స్ ఉంటుంది. అందుకే స్మృతీ ఇరానీ... రాహుల్‌ని ఓడించేందుకు అహర్నిశలూ కృషి చేస్తున్నారు.
మరోవైపు వాయనాడ్‌లో రాహుల్ పోటీకి కూడా కొన్ని కారణాలున్నాయి. వాయనాడ్‌లో 28 శాతం ముస్లిం వర్గం ఓటర్లు, దాదాపు 23 శాతం క్రైస్తవ ఓటర్లున్నారు. రాహుల్ పోటీ చేస్తే... వారంతా కాంగ్రెస్‌కే మద్దతిస్తారని భావిస్తున్నారు. వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో మొదటి నుంచీ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంఐ షాన్వాజ్ విజయం సాధించారు. అందువల్ల రాహుల్ వాయనాడ్‌లో పోటీకి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
ఇవికూడా చదవండి:
స్కూల్ ఫీజు కట్టలేదని... ఎండలో నిలబడిన రెండో తరగతి విద్యార్థులు
నేడు విజయవాడ, అనంతపురంలో రాహుల్ పర్యటనలు... టార్గెట్ నరేంద్ర మోదీ
Published by:
Sulthana Begum Shaik
First published:
March 31, 2019, 11:41 AM IST