ఏడేళ్ల చిన్నారికి రాహుల్ గాంధీ ఫోన్... ఎందుకో తెలుసా ?

ఏడేళ్ల వయస్సున్న ఓ చిన్నారికి రాహుల్ గాంధీ కాల్ చేశాడు... తన కోసం ఎండల్లో 5 గంటల పాటు ఎదురు చూసిన కన్నీటి పర్యంతమైన బుల్లి అభిమానిని ఓదార్చేందుకు రాహుల్ ఫోన్ చేసి పలకరించేందుకు చొరవ చూపారు.

ఏడేళ్ల వయస్సున్న ఓ చిన్నారికి రాహుల్ గాంధీ కాల్ చేశాడు... తన కోసం ఎండల్లో 5 గంటల పాటు ఎదురు చూసిన కన్నీటి పర్యంతమైన బుల్లి అభిమానిని ఓదార్చేందుకు రాహుల్ ఫోన్ చేసి పలకరించేందుకు చొరవ చూపారు.

  • Share this:
    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేరళలో ఒక వింత అనుభవం ఎదురైంది. కన్నూర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీని చూసేందుకు చాలా జనం కూడా భారీగా తరలివచ్చారు. అయితే రాహుల్‌ను విపరీతంగా అభిమానించే ఏడేళ్ల బాలుడు నందన్ మాత్రం దాదాపు 5 గంటల పాటు, అతని రాక కోసం ఎదురు చూస్తున్నాడు. స్థానిక ఆడిటోరియం కిక్కిరిసి పోవడంతో నందన్ అతని తల్లిదండ్రులు అందులోకి ప్రవేశించలేకపోయారు. దీంతో వారు బయటే ఉండాల్సి వచ్చింది. మీటింగ్ అనంతరం రాహుల్ అక్కడి నుంచి నేరుగా వెళ్లిపోయారు. సెక్యూరిటీ కారణాలతో రాహుల్ సభాస్థలి నుంచి నేరుగా వాయనాడ్ వెళ్లిపోయారు.

    దీంతో తన అభిమాన నేతను చూసే వీలుదక్కకపోవడంతో నందన్ భోరుమన్నాడు. అంతే కాదు నందన్ తన చొక్కాపై రాహుల్ గాంధీ స్టిక్కర్ సైతం అతికించుకున్నాడు. అయితే జరిగిన సంఘటనను నందన్ తండ్రి ఫేస్‌బుక్‌లో ఫోటోలతో సహా షేర్ చేశాడు. ఆ పోస్ట్ వైరల్ కావడంతో రాహుల్ గాంధీ వరకూ చేరింది. వెంటనే రాహుల్ పార్టీ నేతలను ఆదేశించి నందన్‌తో మాట్లాడించే ఏర్పాటు చేయాలని ఆదేశించాడు. వారు నందన్ తండ్రిని సంప్రదించి, అతని ఫోన్ నెంబర్ ను రాహుల్ సిబ్బందికి అందచేశారు. అనంతరం రాహుల్ నేరుగా నందన్ కుటుంబానికి ఫోన్ చేసి...బాలుడితో మాట్లాడాడు. తన అభిమాన నేత ఫోన్ చేసి పలకరించడంతో నందన్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. జరిగిన మొత్తం ఘటనను స్థానిక మనోరమ పత్రిక రిపోర్ట్ చేయగా, కాంగ్రెస్ అభిమానులు మాత్రం తమ నేత చొరవను ప్రశంసిస్తున్నారు.

    ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీ ఈ సారి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని అమేథీతో పాటు, కేరళలోని వాయనాడ్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. పార్టీకి దక్షిణాదిన ఓట్లు రాబట్టాలనే వ్యూహంతో రాహుల్ వాయనాడ్‌ను ఎంపిక చేసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
    First published: