ఆర్ఎస్ఎస్ సభకు రాహుల్ వెళ్లరు..తేల్చేసిన కాంగ్రెెస్..!

ఆర్ఎస్ఎస్ మీటింగులకు వెళ్లి ఆ విషాన్ని తాగాల్సిన అవసరం లేదంటూ రాహుల్‌ను ..ఖర్గే వారించినట్లు తెలుస్తుంది.వివాదాస్పద చర్చలకు.. మతపరమైన అంశాల జోలికి వెళ్లకుండా 2019 లోక్‌సభ ఎన్నికలపైనే ప్రధానంగా ద‌ృష్టి పెట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది.

news18
Updated: August 30, 2018, 4:41 PM IST
ఆర్ఎస్ఎస్ సభకు రాహుల్ వెళ్లరు..తేల్చేసిన కాంగ్రెెస్..!
రాహుల్ గాంధీ(ఫైల్ ఫోటో)
  • News18
  • Last Updated: August 30, 2018, 4:41 PM IST
  • Share this:
హస్తినలో మూడురోజుల పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సమావేశాలు నిర్వహించనుంది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశాలకు రావాలంటూ అన్ని రాజకీయాపార్టీలకు ఆహ్వానం పంపింది. అందులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా ఆర్ఎస్ఎస్ ఆహ్వానించనున్నట్లు సమాచారం.  రాహుల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను ఆర్ఎస్ఎస్ మీటింగ్‌కు హాజరయ్యే అవకాశం లేదంటున్నారు ఆ పార్టీ నేతలు.

తాజాగా జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ మీటింగ్‌లో ఇదే విషయమై చర్చ జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే రాహుల్‌ను ఆర్ఎస్ఎస్ మీటింగ్ వెళ్లొద్దని సూచించినట్లు తెలుస్తుంది. సంఘ్ సంస్థ విషం లాంటిందని....సమావేశాలకు ఆ విషాన్ని తాగమనే ఆర్ఎస్ఎస్ స్వాగతిస్తుందని ఖర్గే చెప్పినట్లు సమాచారం. ఆర్ఎస్ఎస్ మీటింగులకు వెళ్లి ఆ విషాన్ని తాగాల్సిన అవసరం లేదంటూ రాహుల్‌ను ..ఖర్గే వారించినట్లు తెలుస్తుంది.

ఇది కూడా చదవండి...RSS మ‌రో సంచ‌ల‌నం...రాహుల్ గాంధీకి ఆహ్వానం ?

మరోవైపు రాహుల్ కూడా ఈ సమావేశాలకు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటే ఆయన ఎన్నోసార్లు... ఆర్ఎస్ఎస్‌పై తనకున్న అయిష్టతను వ్యక్తంచేశారు. విదేశీ పర్యటనలో కూడా రాహుల్ సంఘ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఆర్ఎస్ఎస్‌ని ఈజీప్టులోని ముస్లీం బ్రదర్ హుడ్‌తో పోల్చారు. అంతకుముందు కూడా... సంఘ్ కార్యకలాపాలను రాహుల్ తప్పుపడుతూ వచ్చారు. మహాత్మగాంధీని హత్య చేయించింది ఆర్ఎస్ఎస్ అని కామెంట్లు చేసినందుకుగాను మహారాష్ట్ర కోర్టులో రాహుల్‌పై పరువు నష్టం కేసు కూడా నమోదయ్యింది.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటివాటికి దూరంగా ఉండాలని భావిస్తోంది.  వివాదాస్పద చర్చలకు.. మతపరమైన అంశాల జోలికి వెళ్లకుండా 2019 లోక్‌సభ ఎన్నికలపైనే ప్రధానంగా ద‌ృష్టి పెట్టాలని భావిస్తుంది. రాఫెల్ డీల్. నోట్ల రద్దు అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తోంది.

గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా ఉన్నప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ సమావేశాలకు ఆహ్వానించింది. ఈసారి కూడా సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అనే చర్చాగోష్టిని ఆర్ఎస్ఎస్ నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమంలో ప్రసంగించడానికి అన్నిపార్టీల నేతలకు ఆహ్వానాలు పంపుతుంది.
Published by: Sulthana Begum Shaik
First published: August 30, 2018, 4:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading