ప్రధాని మోదీ సాధించిన అద్భుత విజయాలు ఇవే.. రాహుల్ ట్వీట్

ఢిల్లీ హింసాత్మక ఘటనలు, మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కోల్పోవడం, చైనాకు వంత పాడడం, రాజస్థాన్‌ను నాశనం చేయడం.. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలని బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు.

news18-telugu
Updated: July 21, 2020, 4:18 PM IST
ప్రధాని మోదీ సాధించిన అద్భుత విజయాలు ఇవే.. రాహుల్ ట్వీట్
రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ
  • Share this:
ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. కరోనా కష్టకాలంలో ప్రధాని మోదీ సాధించిన అద్భుత విజయాలు ఇవేనంటూ ఆయన అందులో పేర్కొన్నారు. ఆ ట్వీట్‌ దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఐతే ప్రధాని మోదీని రాహుల్ నిజంగానే పొగడలేదు. కరోనా కష్టాల్లో దేశం కొట్టుమిట్టాడుతుంటే ప్రధాని మోదీ మాత్రం రాజకీయాలు, ఇతర కార్యక్రమాలపై దృష్టిపెట్టారంటూ సెటైరికల్‌గా ఆ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ వైఫల్యం వల్లే కరోనా విజృంభణలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందని విరుచుకుపడ్డారు.

కరోనా వైరస్‌ విజృంభణ వేళ మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు.. ఫిబ్రవరి- హలో ట్రంప్‌, మార్చి- మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కూల్చివేత, ఏప్రిల్‌- కరోనాపై కట్టడికి కొవ్వొత్తుల్ని వెలిగించడం, మే- మోదీ సర్కార్‌కు ఆరో వార్షికోత్సవం, జూన్‌- బీహార్‌లో వర్చువల్‌ ర్యాలీ, జులై- రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ఇలాంటి చర్యలతోనే కరోనా వైరస్‌పై పోరాటంలో భారత్ స్వయం సమృద్ధి (ఆత్మ నిర్భర్) సాధించింది.
రాహుల్ గాంధీ



ఐతే రాహుల్ గాంధీ తీరుపై బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏం సాధించిందంటూ ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ హింసాత్మక ఘటనలు, మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కోల్పోవడం, చైనాకు వంత పాడడం, రాజస్థాన్‌ను నాశనం చేయడం.. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలని విరుచుకుపడుతున్నారు. దీనిపై ఇరు పార్టీల మధ్య ఇప్పుడు ట్విటర్ వార్ జరుగుతోంది.

Published by: Shiva Kumar Addula
First published: July 21, 2020, 4:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading