ఇవాళ శ్రీనగర్‌లో రాహుల్ పర్యటన... రావొద్దంటున్న అధికారులు

నేతల పర్యటనలతో ఆటంకం కలిగించొద్దని కాశ్మీర్ పౌర సంబంధాల శాఖ అధికారులు కోరుతున్నారు.

news18-telugu
Updated: August 24, 2019, 9:22 AM IST
ఇవాళ శ్రీనగర్‌లో రాహుల్ పర్యటన... రావొద్దంటున్న అధికారులు
రాహుల్ గాంధీ
  • Share this:
కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ ఇవాళ శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. 12 మంది సభ్యులతో కూడిన రాహుల్‌ బృందం శ్రీనగర్‌లో పర్యటించనుంది. కాశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై రాహుల్‌ బృందం పరిశీలించనుంది. అయితే రాహుల్ పర్యటనను అక్కడ అధికారులు అడ్డుకుంటున్నారు. రాజకీయ నేతలు ఎవరూ రావొద్దంటన్నారు. కాశ్మీర్ లోయలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు. నేతల పర్యటనలతో  ఆటంకం కలిగించొద్దని కాశ్మీర్ పౌర సంబంధాల శాఖ అధికారులు కోరుతున్నారు.

రాహుల్ గాంధీతో పాటు... కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ కూడా  శ్రీనగర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఇక వీరితో పాటు... అఖిలపక్ష నేతలు కూడా వెంట వెళ్లనున్నారు. సీపీఎంకు చెందిన సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి. రాజా, డీఎంకే నేత తిరుచి శివ, ఆర్జేడీ మనోజ్ ఝా, టీఎంసీ నేత దినేష్ త్రివేది కూడా శ్రీనగర్‌లో పర్యటించనున్నారు.

First published: August 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు