కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు... ఖమ్మంలో రాహుల్ గాంధీ

#TelanganaElections2018 #RahulGandhiInTelangana | తెలంగాణ కోసం పోరాడిన వారిని కేసీఆర్ మరిచిపోయారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. మహాకూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అమరవీరుల కుటుంబాలకు రూ. పరిహారం ఇస్తామని తెలిపారు.

news18-telugu
Updated: November 28, 2018, 5:45 PM IST
కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు... ఖమ్మంలో రాహుల్ గాంధీ
ఖమ్మం సభలో మాట్లాడుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
  • Share this:
తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలోని ఐదుగురికి తప్ప ఎవరికీ ఉద్యోగాలు రాలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఖమ్మంలో ప్రజాకూటమి ఎన్నికల సభలో పాల్గొన్న ఆయన... తెలంగాణలో రైతులు మద్దతు ధర లేకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సరైన ధర ఇవ్వకుండా ప్రభుత్వం భూములు లాక్కుంటోందన్న రాహుల్ గాంధీ... ప్రభుత్వం ల్యాండ్ మాఫియాను నడిపిస్తోందని ధ్వజమెత్తారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ప్రస్తుతం రెండు లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని... రాష్ట్రంలో ఒక్కోక్కరిపై రూ.60 వేల అప్పు ఉందని రాహుల్ గాంధీ అన్నారు.

వాయిదాల్లో రుణమాఫీ చేయడం వల్ల రైతులకు లాభం జరగలేదని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి రాగానే రూ.2లక్షల రుణమాఫీ చేస్తుందని వెల్లడించారు. 17 రకాల పంటలకు మద్దతు ధర ఇస్తామని తెలిపారు. అమరవీరులను, తెలంగాణ కోసం పోరాడిన వారిని కేసీఆర్ మరిచిపోయారని రాహుల్ ఆరోపించారు. మహాకూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అమరవీరుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం ఇస్తామని తెలిపారు. వారి మీద పెట్టిన రాజకీయ కేసులన్నీ తొలగిస్తామని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రోజులో 18 గంటలు తమ ముఖ్యమంత్రి పని చేస్తారని వెల్లడించారు.


తెలంగాణ నిధులున్నీ కేసీఆర్ కుటుంబం, ఆయన బంధువులకే వెళ్లిపోతున్నాయాని రాహుల్ గాంధీ అన్నారు. పనిచేయాల్సిన ముఖ్యమంత్రి ప్రాజెక్టుల రీడిజైన్లు చేస్తూ కూర్చున్నారని తెలిపారు. నీళ్లు - నిధులు - నియామకాల కోసం తెలంగాణ ప్రజలు పోరాడారని... కానీ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని రాహుల్ అన్నారు. రూ.50వేల కోట్లతో కాంగ్రెస్ చేపట్టిన ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ డిజైన్ చేసి కాళేశ్వరం పేరు పెట్టి రూ.93 వేల కోట్లకు పెంచేశారని ఆరోపించారు.

విభజన జరిగినప్పుడు తెలంగాణకు, ఏపీకి కొన్ని హామీలు ఇచ్చామన్న రాహుల్... వాటిని అమలు చేయకపోయినా కేసీఆర్ మోదీకి మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికలు, జీఎస్టీ, అవిశ్వాస తీర్మానం, నోట్ల రద్దు అన్నింట్లోనూ కేసీఆర్ మోదీకి మద్దతిచ్చారని రాహుల్ మండిపడ్డారు. టీఆర్ఎస్, ఎంఐఎం ఇద్దరూ మోదీ గెలవాలని కోరుకుంటున్నాయని ధ్వజమెత్తారు. ఖమ్మంలో జరిగిన సభ చరిత్రాత్మకమైందని చెప్పిన రాహుల్... కేంద్రంలో నరేంద్ర మోదీ అన్ని వ్యవస్థలను ఒక్కొక్కటిగా నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
Published by: Kishore Akkaladevi
First published: November 28, 2018, 5:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading