కాంగ్రెస్‌ నుంచి వెళ్లాలనుకునే వాళ్లు వెళ్లొచ్చు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

రాహుల్ గాంధీ(ఫైల్ ఫోటో)

సచిన్ పైలెట్‌ను పదవుల నుంచి తప్పించినా... ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగేలా చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న వార్తలు నేపథ్యంలో... రాహుల్ గాంధీ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

  • Share this:
    ఓ వైపు రాజస్థాన్‌కు చెందిన కీలక నేత సచిన్ పైలెట్‌ను మళ్లీ తమ దారిలోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో... రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. పార్టీకి చెందిన స్టూడెంట్ వింగ్ విభాగం ఎన్ఎస్‌యూఐ నాయకులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించిన రాహుల్ గాంధీ... పార్టీని వీడాలనుకునే వాళ్లు వెళ్లొచ్చని అన్నారు. అలాంటి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లో సచిన్ పైలెట్ సహా 19 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

    దీంతో కాంగ్రెస్ పార్టీ సచిన్ పైలెట్‌ను వదులుకునేందుకు మానసికంగా సిద్ధమైనట్టు కనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. అంతకుముందు తనకు వ్యక్తిగతంగానూ స్నేహితుడైన సచిన్ పైలెట్‌ను బుజ్జగించేందుకు రాహుల్ గాంధీ పలుసార్లు ఆయనతో మాట్లాడారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే సచిన్ పైలెట్ మాత్రం అశోక్ గెహ్లాట్‌ను సీఎంగా తప్పించాలనే తన డిమాండ్ నుంచి వెనక్కి తగ్గకపోవడంతో... కాంగ్రెస్ నాయకత్వం ఆయనను డిప్యూటీ సీఎం పదవితో పాటు రాజస్థాన్ పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పించింది. అయితే సచిన్ పైలెట్‌ను పదవుల నుంచి తప్పించినా... ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగేలా చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న వార్తలు నేపథ్యంలో... రాహుల్ గాంధీ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published: