Home /News /politics /

RAHUL GANDHI INDIRECTLY SUPPORTS REVANTH REDDY IN MEETING WITH TELANGANA CONGRESS LEADERS AK

Revanth Reddy: రేవంత్ రెడ్డికి సపోర్ట్.. ఆ నేతలకు రాహుల్ గాంధీ షాక్ ?

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: కొందరు నేతలు రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నామనే విషయాలను వివరిస్తే.. మరికొందరు నేతలు పనిలో పనిగా కొత్త టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పరోక్షంగా ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించారని తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
    కాంగ్రెస్ పార్టీలో నేతలు ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకోవడం కొత్తమీ కాదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఈ ట్రెండ్ కాంగ్రెస్‌లో కొనసాగుతూనే ఉంటుంది. ఇటీవల ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలోనూ కొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇదే రకంగా వ్యవహరించారనే టాక్ వినిపిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. వీరితో రాహుల్ గాంధీ చాలా సేపు భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ కొత్త కమిటీ ఏర్పాటు తరువాత రాహుల్ గాంధీ వీరికి టైమ్ ఇవ్వడం ఇదే మొదటిసారి. దీంతో రాహుల్ గాంధీతో అన్ని విషయాలు చర్చించాలని కాంగ్రెస్ నేతలు భావించారు. కొందరు నేతలు రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నామనే విషయాలను వివరిస్తే.. మరికొందరు నేతలు పనిలో పనిగా కొత్త టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పరోక్షంగా ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించారని తెలుస్తోంది.

    కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు తీసుకునే ముందు అందరితో చర్చిస్తారని.. కానీ కొత్త నేతలు ఆ పని చేయకుండా ముందుకు సాగుతున్నారని కొందరు నేతలు పరోక్షంగా రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారని టాక్. అయితే ఈసారి కాంగ్రెస్ నేతలతో సమావేశానికి ముందుగే రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ నుంచి పరిస్థితులపై పూర్తి నివేదిక తెప్పించుకున్న రాహుల్ గాంధీ.. ఈ నేతలకు తనదైన శైలిలో చెక్ చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి.

    రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు మెరుగుపడుతున్నాయని.. ఇలాంటి సమయంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోకుండా అందరూ కలిసి పని చేయాలని రాహుల్ గాంధీ తనకు ఇతర నేతలపై ఫిర్యాదు చేసిన నేతలకు సూచించారని కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న నేతలు.. రేవంత్ రెడ్డిపై కొందరు కాంగ్రెస్ నేతలు చేసే విమర్శలను రాహుల్ గాంధీ పట్టించుకోవడం లేదని చర్చించుకోవడం మొదలుపెట్టారు.

    Harish Rao: టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్‌ హరీశ్‌రావుకు వింత పరిస్థితి.. ప్లస్సా ? మైనస్సా ?

    Revanth Reddy: రేవంత్ రెడ్డిని నిరాశ పరిచిన రాహుల్ గాంధీ.. ఆ ప్లాన్ ఫలించలేదా ?

    తెలంగాణలో రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తరువాత పరిస్థితుల్లో చాలావరకు మార్పు వచ్చిందనే విషయాన్ని రాహుల్ గాంధీ నమ్ముతున్నారని.. అందుకే ఆయనపై వచ్చే ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి అండ్ టీమ్ భావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి రాహుల్ గాంధీతో టీ కాంగ్రెస్ నేతల భేటీ తరువాత రేవంత్ రెడ్డి మరింత జోష్‌గా కనిపిస్తున్నారని.. ఇదంతా రాహుల్ గాంధీకి తనపై నమ్మకం పెరిగిందనే ధీమానే కొందరు చర్చించుకుంటున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Rahul Gandhi, Revanth reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు