రాహుల్‌ గాంధీ అమేథిని వదిలేశారు... కేంద్రమంత్రి స్మృతి ఇరాని విమర్శలు

15 ఏళ్ల పాటు మద్దతుగా నిలిచిన అమేథి ప్రజల్ని రాహుల్ విడిచి వెళ్లడానికి నిర్ణయించుకున్నారని ఆరోపించారు స్మృతి ఇరాని.

news18-telugu
Updated: April 4, 2019, 12:53 PM IST
రాహుల్‌ గాంధీ అమేథిని వదిలేశారు... కేంద్రమంత్రి స్మృతి ఇరాని విమర్శలు
రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ(ఫైల్ ఫోటో)
  • Share this:
వయనాడ్‌లో రాహుల్ నామినేషన్ వేసిన సందర్భంగా మరోసారి ఆయనపై విమర్శలు ఎక్కు పెట్టారు మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరాని. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథి ప్రజల్ని అవమానిస్తున్నారని స్మ‌ృతి మండిపడ్డారు. 15 ఏళ్ల పాటు మద్దతుగా నిలిచిన అమేథి ప్రజల్ని రాహుల్ విడిచి వెళ్లడానికి నిర్ణయించుకున్నారని ఆరోపించారు. ''పదిహేనేళ్లుగా అమేఠీలో ఉన్న వ్యక్తి ఆయన మద్దతుదారులను విడిచివెళ్లడానికి నిర్ణయించుకున్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ కోసం ఆయన మరో స్థానాన్ని ఎంచుకున్నారు. ఇది ఇక్కడి ప్రజలను మోసం చేసి అవమానానికి గురిచేయడమే. రాహుల్‌కు పెద్దగా మద్దతు లభించదన్న విషయం అమేఠీలోని కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా తెలుసు'' అని స్మృతి ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

''రాహుల్‌ గాంధీ సామర్థ్యంపై వయనాడ్‌ ప్రజలకు ఏమైనా అనుమానాలు ఉంటే.. నివృత్తి కోసం వారు అమేథికి రావాల్సిందే'' అంటూ ట్విటర్‌ వేదికగా అభిప్రాయపడ్డారు. అమేథితో పాటు కేరళలోని వయనాడ్ నుంచి కూడా రాహుల్ పోటీ చేస్తున్న సంగతి తెలిసింది. తాజాగా ఆయన వాయనాడ్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రియాంక గాంధితో కలిసి వెళ్లిన ఆయన నామినేషన్ వేశారు. హెలికాఫ్టర్‌లో వయనాడ్‌కు చేరుకున్న రాహుల్, ప్రియాంక నామినేషన్ అనంతరం ఈ నేపథ్యంలో స్మృతి ఇరానీ ఆయనపై విమర్శలతో దాడి చేశారు.
Published by: Sulthana Begum Shaik
First published: April 4, 2019, 12:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading