హోమ్ /వార్తలు /రాజకీయం /

రాహుల్ గాంధీ ర్యాలీలో జర్నలిస్టులకు గాయాలు... సాయం చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు

రాహుల్ గాంధీ ర్యాలీలో జర్నలిస్టులకు గాయాలు... సాయం చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు

జర్నలిస్టును స్ట్రెచర్ మీదకు ఎక్కించేందుకు సాయం చేస్తున్న రాహుల్ గాంధీ, పక్కనే ప్రియాంకా గాంధీ

జర్నలిస్టును స్ట్రెచర్ మీదకు ఎక్కించేందుకు సాయం చేస్తున్న రాహుల్ గాంధీ, పక్కనే ప్రియాంకా గాంధీ

గాయపడిన ముగ్గురు జర్నలిస్టులను ఆంబులెన్స్‌లో ఎక్కించే వరకు రాహుల్ గాంధీ సాయం చేశారు.

  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్ ర్యాలీలో చిన్న తొక్కిసలాట జరిగింది. ర్యాలీని కవర్ చేసేందుకు వెళ్లిన ముగ్గురు జర్నలిస్టులు గాయపడ్డారు. ఆ ముగ్గురు జర్నలిస్టులను రాహుల్ గాంధీ స్వయంగా ఆంబులెన్స్ ఎక్కించి ఆస్పత్రికి పంపారు. కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి రాహుల్ గాంధీ నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యాయి. వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ బ్యారికేడ్లు దూకేందుకు కొందరు ప్రయత్నించారు. ఆ సమయంలో ఓ ఏఎన్ఐ రిపోర్టర్ సహా ముగ్గురు జర్నలిస్టులు గాయపడ్డారు. జర్నలిస్టులు గాయపడిన విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తించారు. వెంటనే ఆయన వారి వద్దకు వచ్చారు. వారిని వెంటనే ఆంబులెన్స్‌లో ఎక్కించే వరకు రాహుల్ గాంధీ, పోలీసులుకు, కార్యకర్తలకు సాయం చేశారు. అనంతరం అక్కడి నుంచి కదిలారు.


  జర్నలిస్టును స్ట్రెచర్ మీదకు ఎక్కించేందుకు సాయం చేస్తున్న రాహుల్ గాంధీ, పక్కనే ప్రియాంకా గాంధీ


  ఇటీవల న్యూ ఢిల్లీలోని హ్యుమాయూన్ రోడ్డులో ఓ జర్నలిస్టు రాజేంద్ర వ్యాస్ గాయపడ్డాడు. దీంతో రాహుల్ గాంధీ వెంటనే అతడిని తన కారులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. గతంలో ఒడిశా పర్యటన సందర్భంగా కూడా ఓ జర్నలిస్టు రాహుల్ గాంధీ ఫొటోలు తీస్తూ మెట్ల మీద నుంచి కిందపడిపోయారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్షుడు వెంటనే అతడి వద్దకు వెళ్లి పైకి లేపారు.


  జర్నలిస్టును స్ట్రెచర్‌పై ఎక్కిస్తున్న రాహుల్ గాంధీ

  First published:

  Tags: Congress, Kerala Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019, Rahul Gandhi, Wayanad S11p04

  ఉత్తమ కథలు