RAHUL GANDHI FOCUS ON ANDHRA PRADESH CONGRESS KEY CHANGES WILL HAPPEN IN AUGUST AK
AP Congress: ఏపీ కాంగ్రెస్‌పై రాహుల్ గాంధీ ఫోకస్.. ఆగస్టులో కీలక మార్పులు ?
రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)
Rahul Gandhi Focus On Andhra Pradesh: ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్‌ను మార్చి.. ఆయన స్థానంలో కొత్త వారిని నియమిస్తారా లేక ఆయనను కొనసాగిస్తూనే మిగతా ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగిస్తారా ? అన్నది తెలియాల్సి ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మళ్లీ దృష్టి పెట్టారు. తెలంగాణ కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించిన కాంగ్రెస్ హైకమాండ్.. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌ను ప్రక్షాళన చేసిన కొత్త జవసత్వాలు నింపే దిశగా చర్యలు చేపట్టనుందని తెలుస్తోంది. ఇందుకోసం రానున్న 15 రోజుల్లో ఏపీ కాంగ్రెస్ ముఖ్యనేతలు ఢిల్లీ రావాలని ఆ పార్టీ హైకమాండ్ సమాచారం ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేవీపీ రామచంద్రరావు, పల్లంరాజు, రఘువీరారెడ్డి సహా పలువురు నేతలకు ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ సమాచారం ఇచ్చినట్టు టాక్.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకోవాలంటే ఏం చేయాలనే దానిపై ఆ పార్టీ హైకమాండ్ ఇప్పటికే సమాలోచనలు జరుపుతోంది. దీనిపై ఓ సమగ్ర నివేదిక ఇవ్వాలని రాహుల్ గాంధీ ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఉమెన్ చాందీని ఆదేశించారని.. ఆయన ఈ అంశంపైనే కసరత్తు చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్టులోనే ఏపీ కాంగ్రెస్‌లో సమూల మార్పులు జరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
అయితే ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్‌ను మార్చి.. ఆయన స్థానంలో కొత్త వారిని నియమిస్తారా లేక ఆయనను కొనసాగిస్తూనే మిగతా ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగిస్తారా ? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఏపీ కాంగ్రెస్ ముఖ్యనేతలు ఢిల్లీ బాట పడితేనే.. అసలు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను మళ్లీ బలోపేతం చేసేందుకు ఆ పార్టీ హైకమాండ్ ఎలాంటి చర్యలు చేపడుతుందనే విషయంలో క్లారిటీ వస్తుందని ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.