Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    మారటోరియం వ్యవధిలో రుణాలపై వడ్డీ..కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా రాహుల్ ప్రశ్న

    Rahul Gandhi on Moratorium: బడా పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం 1.45 లక్షల కోట్ల మేర పన్ను రాయితీలు కల్పించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పేర్కొన్నారు. అయితే మధ్యతరగతి ప్రజలు తీసుకున్న రుణాలపై వడ్డీని మాఫీ చేసేందుకు కేంద్రం సిద్ధంగా లేదని విమర్శలు చేశారు.

    news18-telugu
    Updated: August 27, 2020, 7:27 PM IST
    మారటోరియం వ్యవధిలో రుణాలపై వడ్డీ..కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా రాహుల్ ప్రశ్న
    ప్రతీకాత్మక చిత్రం
    • Share this:
    మారటోరియం వ్యవధిలో రుణాలపై వడ్డీ మాఫీ చేయాలన్న డిమాండ్ మరింత బలపడుతోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈఎంఐల చెల్లింపులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మార్చి నెల నుంచి ఆగస్టు వరకు ఆరు మాసాల మారటోరియం వసతి కల్పించడం తెలిసిందే. అయితే మారటోరియం వ్యవధికి సంబంధించి రుణాలపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ ఇది వరకే స్పష్టంచేసింది. అయితే మారటోరియం వ్యవధికి సంబంధించి వడ్డీని మాఫీ చేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరుతూ కొందరు రుణ చెల్లింపుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లాక్‌డౌన్ కారణంగా తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని...దీని కారణంగా ఈఎంఐలను చెల్లించలేకపోయినట్లు తెలిపారు. మారటోరియం వ్యవధికి సంబంధించి రుణాలపై వడ్డీ, వడ్డీపై వడ్డీ విధించడం ద్వారా తాము తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తంచేశారు.

    ఈ పిటిషన్లపై బుధవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు... ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తంచేసింది. ఆర్బీఐ పేరు చెప్పి కేంద్రం తప్పించుకోవాలని చూడటం సరికాదని, మారటోరియం ప్రయోజనాలు రుణ చెల్లింపుదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. ఈ విషయంలో కేంద్రం తన వైఖరిని స్పష్టంచేసేందుకు సుప్రీంకోర్టు వారం రోజుల గడువు ఇచ్చింది.

    ఈ నేపథ్యంలో మారటోరియం వ్యవధిలో వడ్డీ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ..కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేశారు. బడా పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం 1.45 లక్షల కోట్ల మేర పన్ను రాయితీలు కల్పించిందని పేర్కొన్నారు. అయితే మధ్యతరగతి ప్రజలు తీసుకున్న రుణాలపై వడ్డీని మాఫీ చేసేందుకు కేంద్రం ఎందుకు సిద్ధంగా లేదని ప్రశ్నించారు. మోదీ సర్కారు ‘సూటు బూటు కా సర్కార్’ (బడా పారిశ్రామికవేత్తల ప్రభుత్వం) అంటూ ఎద్దేవా చూశారు.



    మారటోరియం వ్యవధిలో రుణాలపై వడ్డీ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను రాహుల్ గాంధీ తన ట్వీట్‌కు జతచేర్చారు.
    Published by: Janardhan V
    First published: August 27, 2020, 7:27 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading