అత్యాచారాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ చరిత్రలో మొదటిసారి ఓ నాయకుడు భారతీయ మహిళలు అత్యాచారానికి గురికావాల్సిందే అంటున్నాడని మండిపడ్డారు. ఇదేనా దేశానికి రాహుల్ ఇచ్చే సందేశం అంటూ ప్రశ్నించారు. రాహుల్‌ను కచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలు భారత్‌ను అవమానించడమే అన్నారు.ప్రతీ పురుషుడు రేపిస్టు కాదన్న సంగతి గుర్తెరగాలన్నారు. 50ఏళ్లకు చేరువవుతున్నా రాహుల్‌కి ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నారు. రాహుల్ వ్యాఖ్యలు ఇండియాలో రేప్‌లకు ఆహ్వానం లాగా ఉందన్నారు. రాహుల్ కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. మరో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. అత్యాచారాలపై అలాంటి వ్యాఖ్యలు చేసినవారికి లోక్‌సభలో ఉండే నైతిక అర్హత లేదని రాహుల్‌ను ఉద్దేశించి అన్నారు.
కాగా, దిశా హత్యాచార ఘటన తర్వాత రాహుల్ గాంధీ 'ఇండియా రేప్‌ల రాజధానిగా మారిపోయింది' అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రపంచ దేశాల ముందు భారత్‌ను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు చేశారని వారు విమర్శిస్తున్నారు.
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.