కాలినడకన వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాహుల్ గాంధీ

అలిపిరి నుంచి తిరుమలకు నడకదారిన వెళ్తున్న రాహుల్ గాంధీ. పక్కన మేనల్లుడు రేహాన్ వాద్రా

Rahul Gandhi AP Tour: మేనల్లుడు రేహాన్‌ వాద్రాతో పోటీపడుతూ నడిచిన రాహుల్ గాంధీ...కేవలం గంటా 50 నిమిషాల వ్యవధిలోనే అలిపిరి నుంచి కలినడకన తిరుమలకు చేరుకున్నారు.

 • Share this:
  కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కాలినడక మార్గంలో తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరిలో ఉదయం 11:40 గంటల సమయంలో నడక ప్రారంభించి మధ్యాహ్నం 1:30 గంటలకు కొండపైకి చేరుకున్నారు. కేవలం గంటా 10 నిమిషాల వ్యవధిలోనే రాహుల్ గాంధీ కాలినడకన అలిపిరి నుంచి తిరుమలకు చేరుకోవడం విశేషం. నడక మార్గంలో ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా సుమారు 3500లకు పైగా మెట్లు ఎక్కారు రాహుల్ గాంధీ.

  తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాహుల్ గాంధీ
  తిరుమలకు కాలినడకన వెళ్తూ రాహుల్ గాంధీ. పక్కన మేనల్లుడు రేహాన్ వాద్రా


  కాలినడక దారిలో తన మేనల్లుడు రేహాన్‌ వాద్రా(ప్రియాంక గాంధీ తనయుడు)తో కలసి పోటీపడుతూ రాహుల్ గాంధీ ఉత్సాహంగా నడిచారు. ఈ సందర్భంగా పటిష్ట బందోబస్తు  ఏర్పాట్లు చేశారు.

   

   

   

   

   

   

     అనంతరం రాహుల్ సాంప్రదాయ దుస్తులతో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. రాహుల్ పంచెకట్టుతో వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌ నుంచి ఆలయంలోనికి ప్రవేశించిన రాహుల్ గాంధీకి టీటీడీ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో రాహుల్‌కు పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

  rahul gandhi, tirumala temple, rahul gandhi ap tour, tirumala, ttd, rehan vadra, congress, rahul gandhi tirupati, రాహుల్ గాంధీ, తిరుమల, టీటీడీ, శ్రీవారి ఆలయం
  తిరుమల శ్రీవారి సేవలో రాహుల్ గాంధీ


  రాహుల్‌తో పాటు కాంగ్రెస్‌ నేతలు ఊమెన్‌ చాందీ, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, కనుమూరి బాపిరాజు, జేడీ శీలం, టీ.సుబ్బిరామి రెడ్డి  తదితరులు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

  అనంతరం తిరుపతిలో బహిరంగ సభలో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో మోదీ నిర్వహించిన సభాస్థలిలోనే రాహుల్ గాంధీ ‘ప్రత్యేక హోదా భరోసా సభ’ జరగుతుండడం విశేషం. ఈ సందర్బంగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో నరేంద్ర మోడీ దేవుడి సాక్షిగా ఇచ్చిన మాటను తప్పడంపై రాహుల్ గాంధీ నిలదీయనున్నారు.
  First published: