శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్తత... రాహుల్‌ని అడ్డుకున్న పోలీసులు

జమ్మూ కాశ్మీర్ పరిస్థితుల్ని సమీక్షించేందుకు శ్రీనగర్‌కు 11 విపక్ష పార్టీల సభ్యులు వెళ్లారు. కాశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై రాహుల్‌ బృందం పరిశీలించేందుకు వెళ్లింది.

news18-telugu
Updated: August 24, 2019, 4:15 PM IST
శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్తత... రాహుల్‌ని అడ్డుకున్న పోలీసులు
రాహుల్ గాంధీ (ఫైల్)
news18-telugu
Updated: August 24, 2019, 4:15 PM IST
శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రాహుల్‌ గాంధీతో పాటు... శ్రీనగర్ వెళ్లిన అఖిలపక్ష నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. పర్యటనకు పర్మిషన్ లేదంటూ వారితో వాగ్వాదానికి దిగారు. జమ్మూ కాశ్మీర్ పరిస్థితుల్ని సమీక్షించేందుకు శ్రీనగర్‌కు 11 విపక్ష పార్టీల సభ్యులు వెళ్లారు. కాశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై రాహుల్‌ బృందం పరిశీలించనుంది. అయితే రాహుల్ పర్యటనను అక్కడ అధికారులు అడ్డుకుంటున్నారు. రాజకీయ నేతలు ఎవరూ రావొద్దంటన్నారు. కాశ్మీర్ లోయలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు. నేతలు పర్యటనలతో ఆటంకం కలిగించొద్దని కాశ్మీర్ పౌర సంబంధాల శాఖ అధికారులు కోరుతున్నారు.

రాహుల్ గాంధీతో పాటు... కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ కూడా శ్రీనగర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఇక వీరితో పాటు... అఖిలపక్ష నేతలు కూడా వెంట వెళ్లనున్నారు. సీపీఎంకు చెందిన సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి. రాజా, డీఎంకే నేత తిరుచి శివ, ఆర్జేడీ మనోజ్ ఝా, టీఎంసీ నేత దినేష్ త్రివేది కూడా శ్రీనగర్‌ పర్యటనకు బయల్దేరారు.

First published: August 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...