RAGHUVEERA REDDY ALLEGES KCR BEHIND STOPING SPECIAL STATUS FOR AP
ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్నది కేసీఆరే: రఘువీరా
రఘువీరారెడ్డి( ఫేస్ బుక్ ఫోటో)
ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ డ్రామాలాడుతోందని రఘువీరా రెడ్డి ధ్వజమెత్తారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడం ఆ పార్టీ చేతగానితనమేనని ధ్వజమెత్తారు.
ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆరోపించారు. ప్రత్యేక హోదాపై వైసీపీ డ్రామాలాడుతోందని ఆయన ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తామన్నా కాంగ్రెస్‌ను వైసీపీ నేతలు ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించారు. బీజేపీ, వైసీపీ మధ్య ఫెవికాల్ బంధం కోడికత్తి ఎపిసోడ్‌తో మరింత బలపడిందని వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లాలో మీడియాతో మాట్లాడిన రఘువీరా...పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించాలని రఘువీరా డిమాండ్ చేశారు.
వైసీపీది చేతగానితనం: రఘువీరా
ప్రజాసమస్యలపై అసెంబ్లీలో వాణిని వినిపిస్తారనే ప్రజలు వైసీపీ ఎమ్మెల్యేలను గెలిపించారని రఘువీరా అన్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడం ఆ పార్టీ చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు. పార్టీ ఎమ్మెల్యేలను సభకు పంపితే ఎక్కడ అమ్ముడుపోతారన్న భయంతోనే వారందరినీ జగన్ అసెంబ్లీకి పంపకుండా...తన వెంట పెట్టుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.