అమరావతి ఉద్యమంపై YSRCP రెబల్ ఎంపీ రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు

రఘురామకృష్ణంరాజు

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగుతుందన్నారు.

 • Share this:
  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగుతుందన్నారు. అమరావతి రైతులు శాంతియుతంగా చేస్తున్న ధర్నా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. సోమవారం ఢిల్లీలో అమరావతి రైతుల గురించి రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు. మహిళలు ముందుంటే ఏ పోరాటంలోనైనా శుభం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని మహిళలు టీవీ సీరియళ్లు చూసే సమయాన్ని 50 శాతం తగ్గించుకుని.. అమరావతి రైతుల సమస్యపై దృష్టి పెట్టాలని కోరారు. అమరావతి సాధించేంతవరకు మహిళలు విశ్రమించరాదని పిలుపునిచ్చారు.

  సినిమా శతదినోత్సవం, రజతోత్సవం, వజ్రోత్సవం లాగా.. అమరావతి ధర్నా 300వ రోజు అంటూ ప్రచారం చేసుకోకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని విస్తరించడంపై శ్రద్ధ చూపాలని రైతులకు రఘరామకృష్ణంరాజు సూచన చేశారు. రెట్టింపు ఉత్సాహంతో ఆందోళనలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. రాజధానిగా అమరావతి కొనసాగింపునకు రెఫరెండంగా ఎన్నికలకు వెళ్లేందుకు తాను విసిరిన సవాలుపై స్పందించకుండా కొందరు తోకముడిచారని అన్నారు. తనను దూషిస్తూ కొందరు మేసేజ్‌లు చేస్తున్నారని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని విమర్శించారు. దళితులపై జరుగుతున్న దాడులపై తన సొంత డబ్బులతో న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

  ఇప్పటికే రాష్ట్రంలో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలను నాశనం చేశారని.. ఇప్పుడు న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం కొనసాగుతుందన్నారు. వాళ్లని కాపాడుకునే ప్రయత్నంలో వ్యవస్థలను భ్రష్టు పట్టించడం తగది వైసీపీని ఉద్దేశించి విమర్శలు చేశారు. ఇటువంటి చర్యల వల్ల రాజ్యంగ సంక్షోభం తలెత్తే అవకాశం ఉంన్నారు.
  Published by:Sumanth Kanukula
  First published: