అంతకు మించి ఏం చెయ్యలేరుగా.. వైసీపీకి రఘురామకృష్ణంరాజు కౌంటర్...

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో రఘురామకృష్ణంరాజు సమావేశం అయ్యారు.

news18-telugu
Updated: July 18, 2020, 2:24 PM IST
అంతకు మించి ఏం చెయ్యలేరుగా.. వైసీపీకి రఘురామకృష్ణంరాజు కౌంటర్...
రఘురామకృష్ణంరాజు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకి ఆ పార్టీ షాక్ ఇచ్చింది. లోక్ సభలో ఆయన కూర్చునే సీటు మార్చింది. ఈ మేరకు లోక్ సభ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. రఘురామకృష్ణంరాజు ఇప్పటి వరకు 379 నెంబర్ సీటులో కూర్చునే వారు. ఆయన సీటును అక్కడి నుంచి మార్చారు. దాన్ని మరో ఎంపీ మార్గాని భరత్‌కు కేటాయించారు. మార్గాని భరత్ కూర్చునే 385 సీటును కోటగిరి శ్రీధర్‌కు కేటాయించారు. కోటగిరి కూర్చునే 421 సీటును బెల్లన చంద్రశేఖర్‌కు ఇచ్చారు. బెల్లన చంద్రశేఖర్ కూర్చునే 445 సీటు ను రఘురామకృష్ణంరాజుకు కేటాయించారు. ఇటీవల వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను కలిశారు. రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ 100 పేజీల ఫిర్యాదు లేఖను అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన రఘురామకృష్ణంరాజు టీడీపీ, బీజేపీకి అనుకూలంగా ఉంటూ, ప్రభుత్వం మీద, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ పార్టీకి వ్యతిరేకంగా పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో రఘురామకృష్ణంరాజు సీటు మారుస్తూ లోక్ సభ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.

వైసీపీ ఎంపీల సీట్లు మారుస్తూ లోక్ సభ కార్యాలయం నుంచి వెలువడిన ఆదేశాలు


మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో రఘురామకృష్ణంరాజు సమావేశం అయ్యారు. అయితే, ఇది రాజకీయ సమావేశం కాదని, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ హోదాలో జేపీ నడ్డా సలహాలకోసం మాత్రమే వచ్చానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెప్పారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల సమస్య సంగతి తనకు తెలియదని, తనకు మాత్రం భద్రత లేదన్నారు. గతంలో ఆయన తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ లోక్ సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. అలాగే, వైసీపీ నేతలు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఆయన లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను కలిశారు.

రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలంటూ లోక్ సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన వైసీపీ ఎంపీలు (File)


లోక్‌సభలో తన సీటు మార్పు మీద కూడా రఘురామకృష్ణంరాజు స్పందించారు. ‘పార్ల‌మెంట్‌లో నా స్థానం మార్చుకోగలరు. కానీ, ఏం చేయలేదు. నాపై అనర్హత పిటిషన్ సాధ్యం కాదు కాబట్టే పార్లమెంట్‌లో సీటు మార్చి సంతోష పడాలని చూస్తున్నారు. ఈనెల 21న రాష్ట్రపతితో నా భద్రతపై చర్చిస్తా.’ అని రఘురామకృష్ణంరాజు చెప్పారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 18, 2020, 2:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading