సీఎం జగన్ డిక్లరేషన్‌పై సంతకం పెట్టాకే  శ్రీవారిని దర్శించుకోవాలి.. రఘురామకృష్ణంరాజు

తిరుమల శ్రీవారిని దర్శించుకునే అన్యమతస్థులు డిక్లరేషన్‌పై సంతకం చేయడం అవసరం లేదని టీటీడీ చెర్మన్ అనడంపై నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం ఘాటుగా స్పందించారు. తిరుమలలో అన్యమతస్థులకు డిక్లరేషన్ అవసరం లేదన్న వైవీ సుబ్బారెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: September 19, 2020, 7:15 PM IST
సీఎం జగన్ డిక్లరేషన్‌పై సంతకం పెట్టాకే  శ్రీవారిని దర్శించుకోవాలి.. రఘురామకృష్ణంరాజు
రఘురామకృష్ణంరాజు (File)
  • Share this:
తిరుమల శ్రీవారిని దర్శించుకునే అన్యమతస్థులు డిక్లరేషన్‌పై సంతకం చేయడం అవసరం లేదని టీటీడీ చెర్మన్ అనడంపై నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం ఘాటుగా స్పందించారు. తిరుమలలో అన్యమతస్థులకు డిక్లరేషన్ అవసరం లేదన్న వైవీ సుబ్బారెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా డిక్లరేషన్‌పై సంతకం పెట్టి శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు. ఈ మేరకు రఘురామకృష్ణంరాజు శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తిరుమల ఆలయంలో నిబంధలనలు కఠినంగా అమలు చేయాలని కోరారు. వెంకన్నకు అన్యాయం చేసిన వాళ్లెవరూ బాగుపడలేదని హెచ్చరించారు.

హిందూవుల మనోభావాలు దెబ్బతీయద్దని రుఘరామ కృష్ణంరాజు కోరారు. ప్రభుత్వ బాండ్లలో టీటీడీ నిధులు ఇన్వెస్ట్ చేయడం సరికాదన్నారు. దేవుడి సొమ్మును ఏపీ ప్రభుత్వ బాండ్లలో ఎలా పెడతారని ప్రశ్నించారు. దేవుడి సొమ్మును దోచుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. వెంకన్నకు అన్యాయం చేసిన వాళ్లెవరూ బాగుపడలేదని హెచ్చరించారు. అన్నికులాలు, మతాలపై తనకు గౌరవం ఉందని ఆయ అన్నారు. అలాంటిది తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ప్రాంగణంలో తన మానసిక స్థితి బాగోలేదని మాట్లాడరని.. కానీ అది వారి మానసిక పరిస్థితికి అద్దం పడుతుందన్నారు.

తాను రాజ్యంగాన్ని గౌరవిస్తానని.. తనపై అనర్హత వేటు సాధ్యం కాదని అన్నారు. వైసీపీ ఎంపీలు న్యాయవ్యవస్థను కించపరచడం సరికాదని అభిప్రాయపడ్డారు. కాగా, కొద్ది కాలంగా సొంత పార్టీపైనే రఘురామకృష్ణం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.
Published by: Sumanth Kanukula
First published: September 19, 2020, 5:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading