నాకు కరోనా అంటించాలని చూస్తున్నారు.. రఘురామక‌ష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు..

గత కొంతకాలంగా సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు చేస్తున్న.. వైసీపీ ఎంపీ రఘురామ‌కృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వం తనపై కేసు పెట్టి.. కరోనా అంటించాలని చూస్తుందని ఆరోపించారు.

news18-telugu
Updated: September 26, 2020, 5:18 PM IST
నాకు కరోనా అంటించాలని చూస్తున్నారు.. రఘురామక‌ష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు..
రఘురామక‌ష్ణంరాజు
  • Share this:
గత కొంతకాలంగా సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు చేస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ‌కృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వం తనపై కేసు పెట్టి.. కరోనా అంటించాలని చూస్తుందని ఆరోపించారు. ఢిల్లీ‌లో ఆయన మాట్లాడుతూ.. కొందరు ఆలయాలు, తన కార్యాలయాలు, ఆస్తులపై దాడులకు పాల్పడేందుకు యత్నిస్తున్నారని.. ఇలా తనను రెచ్చగొట్టాలని చూస్తున్నారని అన్నారు. ఇలా దాడి చేసిన సందర్భంలో తాను ఏదైనా ఆవేశ పడితే+.. కేసు పెట్టి జైలుకు పంపించాలనే కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. సీఎం ఆఫీసు నుంచి, పార్టీ ఆఫీసు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తనపై దాడి జరుగబోతుందని చెప్పుకొచ్చారు. దళిత క్రిస్టియన్‌ల చేత ఈ దాడి చేయించేందుకు కుట్ర జరగుతందని చలన వ్యాఖ్యలు చేశారు. దాడి జరుగుతుందో లేదో మీరే చూడండి అని అన్నారు.

రాష్ట్రంలో మతమార్పిడిని ప్రోత్సహిస్తున్నారని.. ఇందుకోసం విదేశాల నుంచి భారీగా నిధులు వస్తున్నాయని ఆరోపించారు. హిందువులు మేల్కొనాలని.. మతంపై జరుగుతున్న దాడిని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. చాలా మంది క్రిస్టియన్స్ హిందూ సర్టిఫికెట్స్‌తో ఉన్నారని అన్న ఆయన.. అన్ని పార్టీలు రాజకీయ ప్రయోజనాలు, ఓట్ల కోసం ఈ విషయాలు మాట్లాడవని అన్నారు. ఏపీలో ఉన్న పోలీసులకు చట్టాలపై అవగాహన లేదని విమర్శించారు. ఏపీలో ఆటవిక రాజ్యం నడుస్తోదంటూ రఘురామ విరుచుకుపడ్డారు.

ఇక, గత కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వంపై, పార్టీపై రఘురామకృష్ణంరాజు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.  సొంత పార్టీ నేతలే తనను ఇబ్బందికి గురిచేస్తున్నారని.. కానీ రాజ్యంగబద్ధంగా తనను ఏమీ చేయలేరని అంటున్నారు. తనకు రక్షణ కల్పించాలని కేంద్రానికి లేఖ రాయడంతో పాటుగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్రం రక్షణ కూడా కల్పించింది.
Published by: Sumanth Kanukula
First published: September 26, 2020, 5:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading