వైసీపీ ఎంపీల ఢిల్లీ టూర్ వేళ సీఎం జగన్‌పై రఘురామకృష్ణం రాజు కామెంట్స్.. ప్రధానికి లేఖ..

Raghuramakrishnam Raju | ఓ వైపు తన మీద సస్పెన్షన్ వేటు వేసేలా స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు వైసీపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్తున్న వేళ సీఎం జగన్‌పై తొలిసారి ప్రత్యక్షంగా కామెంట్స్ చేశారు రఘురామకృష్ణంరాజు.

news18-telugu
Updated: July 2, 2020, 4:57 PM IST
వైసీపీ ఎంపీల ఢిల్లీ టూర్ వేళ సీఎం జగన్‌పై రఘురామకృష్ణం రాజు కామెంట్స్.. ప్రధానికి లేఖ..
వైఎస్ జగన్, రఘురామ కృష్ణంరాజు (ఫైల్ ఫోటో)
  • Share this:
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఢిల్లీ పర్యటనపై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించారు. ఈనెల 3న వైసీపీ ఎంపీలు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలవనున్నారు. స్పీకర్ ఓం బిర్లా వైసీపీ ఎంపీలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. వైసీపీ ఎంపీలతో పాటు ప్రత్యేక విమానంలో కొందరు న్యాయవాదులు కూడా వెళుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వైసీపీ ఎంపీల హస్తిన పర్యటనపై రఘురామకృష్ణం రాజు స్పందించారు. వారి ఢిల్లీ పర్యటనతో ఎలాంటి ప్రయోజనం ఉండబోదన్నారు. ఇన్నాళ్లు సీఎం జగన్‌కు తెలియకుండా నడుస్తోందని భావించానని, ఢిల్లీకి ప్రత్యేక విమానంలో ఎంపీలు, న్యాయవాదులను పంపిస్తున్నారంటే.. సీఎం కనుసన్నల్లోనే అంతా జరుగుతోందని స్పష్టమైందని అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలు ప్రస్తావించిన వారిని సస్పెండ్ చేస్తే.. పార్లమెంట్‌లో ఎవరూ ఉండబోరన్నారు. తాను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మరోసారి స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి భూములు అమ్మొద్దని చెప్పానని, సీఎం జగన్ కూడా ఆ తర్వాత అదే నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇసుక, పేదలందరికీ ఇళ్లు పథకంలో ఉన్న తప్పులను మాత్రమే తాను ప్రస్తావించానన్నారు.

మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నర్సాపరం ఎంపీ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధానికి లేఖ రాశారు. దూరదృష్టితో తీసుకున్న పరిపాలనా నిర్ణయంతో 80 కోట్ల మంది పేదలకు మేలు చేస్తుందని ఆకాంక్షించారు. మోదీని దయగల మనిషిగా చరిత్ర గుర్తిస్తుందంటూ రఘురామ కృష్ణంరాజు లేఖలో కొనియాడారు.
First published: July 2, 2020, 4:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading