ఓట్ల కోసం రేప్ కేసులో దోషిని వెనకేసుకొచ్చిన మాజీ సీఎం..

Rabri plays caste card : మైనర్ బాలికపై అత్యాచార కేసులో గతేడాది డిసెంబర్‌లో రాజ్‌బల్లభ్‌తో పాటు మరో నలుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. దీంతో అతను ఎన్నికల్లో పోటీకి అతనిపై అనర్హత వేటు పడ్డట్టయింది. ఈ నేపథ్యంలో రాజ్‌బల్లభ్ స్థానంలో అతని భార్య విభాదేవిని ఆర్జేడీ బరిలో నిలిపింది.

news18-telugu
Updated: April 5, 2019, 1:20 PM IST
ఓట్ల కోసం రేప్ కేసులో దోషిని వెనకేసుకొచ్చిన మాజీ సీఎం..
ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న రబ్రీ దేవి
  • Share this:
ఓట్ల కోసం ఓ అత్యాచార కేసులో దోషిగా తేలిన వ్యక్తిని వెనకేసుకొస్తూ బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి కామెంట్స్ చేశారు. అతను యాదవ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో.. ఆ కమ్యూనిటీ ఓట్ల కోసం రబ్రీ అతన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఎవరా వ్యక్తి అంటే.. రాజ్‌బల్లభ్‌. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలి శిక్ష కూడా అనుభవించాడు. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోగా.. ఆర్జేడీ అతని భార్యకు లోక్‌సభ టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాజ్‌బల్లభ్‌ భార్య తరుపున ప్రచారం చేసేందుకు రబ్రీ దేవి ఓ సభలో పాల్గొన్నారు. రాజ్‌బల్లబ్‌ను జైలుకు పంపించడం ద్వారా నితీశ్ కుమార్ సర్కార్ యాదవుల ప్రతిష్టను దెబ్బతీశారని రబ్రీ దేవి విమర్శించారు.

తప్పుడు కేసులతో రాజ్‌బల్లభ్‌ను జైలుకు పంపించి యాదవుల ప్రతిష్టను దెబ్బతీశారు. కాబట్టి నవాదా నియోజకవర్గ ప్రజలు రాజ్‌బల్లబ్‌ భార్య విభాదేవిని భారీ మెజారిటీతో గెలిపించాలి.
రబ్రీ దేవి, బీహార్ మాజీ సీఎం


కాగా, మైనర్ బాలికపై అత్యాచార కేసులో గతేడాది డిసెంబర్‌లో రాజ్‌బల్లభ్‌తో పాటు మరో నలుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. దీంతో అతను ఎన్నికల్లో పోటీకి అతనిపై అనర్హత వేటు పడ్డట్టయింది. ఈ నేపథ్యంలో రాజ్‌బల్లభ్ స్థానంలో అతని భార్య విభాదేవిని ఆర్జేడీ బరిలో నిలిపింది. ఇక తమపై ఉన్న అవినీతి కేసులపై స్పందిస్తూ.. తమది చాలా అమాయక కుటుంబం అన్నారు. ప్రజలకు నిజాలన్నీ తెలుసని అన్నారు. రైల్వేశాఖ అధికారులే లాలూ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పారని గుర్తుచేశారు.ఇదిలా ఉంటే, సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బీహార్‌లో ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు పోలింగ్ జరగనుండగా.. మే 23న ఫలితాలు వెలువడుతాయి.
Published by: Srinivas Mittapalli
First published: April 5, 2019, 1:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading