హోమ్ /వార్తలు /రాజకీయం /

‘జరిగింది చాలు ఇంక ఇంటికిరా బిడ్డా’.. అంటున్న బీహార్ మాజీ సీఎం

‘జరిగింది చాలు ఇంక ఇంటికిరా బిడ్డా’.. అంటున్న బీహార్ మాజీ సీఎం

కుమారుడు తేజ్ ప్రతాప్‌తో రబ్రీదేవి

కుమారుడు తేజ్ ప్రతాప్‌తో రబ్రీదేవి

తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ మధ్య లేనిపోని గొడవలు సృష్టించేందుకు జేడీయూ, బీజేపీకి చెందిన నేతలు ప్రయత్నిస్తున్నారని రబ్రీదేవి మండిపడ్డారు.

  బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి తమ కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు విజ్ఞప్తి చేశారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన కొడుకుని ఇక ఇంటికి రావాల్సిందిగా కోరారు. లాలూ - రబ్రీదేవిల కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ ఇంట్లో అలిగి వెళ్లిపోయారు. తన భార్య ఐశ్యర్యరాయ్‌తో విడాకులు కావాలని కుటుంబాన్ని కోరారు. దాణా కుంభకోణంలో శిక్షపడిన తర్వాత అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను రాంచీ ఆస్పత్రిలో కలిసిన తర్వాత నుంచి తేజ్ ప్రతాప్ ఇంటికి రావడం మానేశారు. అప్పుడప్పుడు మీడియాలో కనిపించినా ఇంటికి మాత్రం వెళ్లడం లేదు. ఇప్పుడు పాట్నాలోనే వేరే ఇంట్లో ఉంటున్నారు. దీంతో తల్లడిల్లిన తల్లి రబ్రీదేవి ఇక జరిగింది చాలని ఇంటికి రావాలని కొడుకుని కోరింది.


  bihar election 2019, lok sabha election 2019, tejaswi yadav, tej pratap yadav, rjd, congress, rjd congress, బీహార్, తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్
  సోదరుడు తేజస్వితో తేజ్ ప్రతాప్ (ఫైల్ ఫోటో)


  తమ ఇద్దరు కుమారుల మధ్య చిచ్చు పెట్టడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని రబ్రీదేవి ఆరోపించారు. తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ మధ్య లేనిపోని గొడవలు సృష్టించేందుకు జేడీయూ, బీజేపీకి చెందిన నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కుటుంబాన్ని విడదీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

  First published:

  Tags: Bihar, Lalu Prasad Yadav

  ఉత్తమ కథలు