జగన్ ఈజ్ రైట్... ఆర్.నారాయణమూర్తి సపోర్ట్
తన సినిమాలకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే కథలు అని నారాయణమూర్తి అన్నారు. తాను అనుభవించిన, చూసిన సమస్యలపైనే సినిమాలు తీస్తున్నానని వ్యాఖ్యానించారు.
news18-telugu
Updated: November 18, 2019, 1:21 PM IST

నారాయణమూర్తి, జగన్
- News18 Telugu
- Last Updated: November 18, 2019, 1:21 PM IST
ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తాను తాను సమర్ధిస్తున్నానని ప్రముఖ సినీ నటుడు నారాయణమూర్తి అన్నారు. ఇంగ్లీష్ మీడియంలో చదివిన వారు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారని... తెలుగు మీడియంలో చదివే పిల్లలు సెక్యూరిటీ గార్డులుగా, పోలీసు కానిస్టేబుళ్లుగా మారుతూ చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమితం అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేజీ నుంచి పీజీ వరకూ ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు రావాలన్నదే తన అభిమతమని ఆర్ నారాయణమూర్తి స్పష్టం చేశారు.
భవిష్యత్ తరాలకు ఇంగ్లీష్ విద్య తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. తన సినిమాలకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే కథలు అని నారాయణమూర్తి అన్నారు. తాను అనుభవించిన, చూసిన సమస్యలపైనే సినిమాలు తీస్తున్నానని వ్యాఖ్యానించారు. కాకినాడ సమీపంలోని నడికుదురులో ఏర్పాటు చేసిన తాండ్ర పాపారాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వచ్చిన నారాయణమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు చిక్కులు...
విజయవాడ వాసులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్...
అమ్మో అసెంబ్లీ సమావేశాలు... అమరావతిలో మహిళా ఉద్యోగుల భయం భయం...
తిరుమల బూందీపోటులో అగ్నిప్రమాదం... భారీగా ఎగిసిపడిన మంటలు
తిరుపతిలో దారుణం... లిప్ట్ ఇస్తామంటూ బాలికపై ఇద్దరి అత్యాచారం
జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ పవన్ కల్యాణ్..
Loading...