PUT ME IN JAIL IF YOU WANT TO SAYS UDDHAV THACKERAY SLAMS BJP ON RAIDS PVN
Uddhav Thackeray: ఫ్యామిలీ జోలికొద్దు..కావాలంటే బీజేపీ నన్ను జైల్లో పెట్టొచ్చు
ఉద్దవ్ ఠాక్రే(ఫైల్ ఫొటో)
Uddhav Thackeray slams BJP : కేంద్ర ప్రభుత్వంపై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహావికాస్ ఆఘాడీ(MVA) కూటమి నేతలతో పాటు, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని ఉద్దవ్ ఠాక్రే తెలిపారు.
Uddhav Thackeray slams BJP : కేంద్ర ప్రభుత్వంపై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహావికాస్ ఆఘాడీ(MVA) కూటమి నేతలతో పాటు, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని ఉద్దవ్ ఠాక్రే తెలిపారు. అధికారం కోసం బీజేపీ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నదని... రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు తమ నేతలను , బంధువులును జైల్లో పెట్టడం బీజేపీ లక్ష్యమైతే ముందు తనను జైల్లో పెట్టాలంటూ ఉద్ధవ్ ఠాక్రే బీజేపీకి సవాల్ విసిరారు. తనను జైలుకు పంపాలనుకుంటే పంపండి గానీ.. చేతగాని తనంతో తమ కుటుంబ సభ్యులను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ తమ ఇష్టానుసారానికి ఉపయోగించుకుంటూ.. వాటిని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.
మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన కీలక నేతలపై ఇటీవల వరుసగా ఈడీ దాడులు జరుగుతున్నాయి. తాజాగా మనీలాండరింగ్ కేసులో సీఎం బావమరిది శ్రీధర్ కి చెందిన రూ.6.45 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకున్న మూడు రోజుల తర్వాత ఉద్దవ్ ఈమేరకు శుక్రవారం అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈడీ తమ బంధువుల ఆస్తులను సీజ్ చేయడం తనను లక్ష్యంగా చేసుకోవడమే అని ఉద్దవ్ తీవ్రంగా బీజేపీపై ద్వజమెత్తారు. అధికారంలోకి రావాలంటే ప్రజా బలంతో రండి గానీ.. ఇలాంటి దుర్మార్గపు పనులు చేయకండి అని బీజేపీకి హితవు పలికారు.
మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి నవాబ్ మాలిక్ రాజీనామాను బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన తీవ్రంగా మండిపడ్డారు. నవాబ్ మాలిక్‌కు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని, ఈ విషయం మాజీ సీఎం ఫడ్నవీస్‌కు కూడా తెలుసని ఆయన ఘాటుగా స్పందించారు. అసలు మంత్రి నవాబ్ మాలిక్‌కు దావూద్‌తో సంబంధాలు ఉంటే, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇన్నేళ్లుగా ఏం చేస్తున్నాయని సీఎం ప్రశ్నించారు. దావూద్ ఇబ్రహీంతో మాలిక్ డీల్‌కు సంబంధించిన వివరాలు ఈడీకి ఇచ్చానని చెబుతున్న బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ను కేంద్రం సీబీఐ లేదా రా సంస్థల్లో చేర్చుకోవచ్చు కదా అని ఎద్దేవా చేశారు. రామమందిరం పేరుతో ఓట్లు అడిగిన బీజేపీ, ఇప్పుడు దావూద్ ను ఉపయోగించుకోవాలని భావిస్తున్నదని పేర్కొన్నారు. లాడెన్ ను చంపించినట్టు దావూద్ ఎక్కడున్నాడో గుర్తించి హతమార్చే దమ్ము, ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.