పురంధేశ్వరికి లైన్ క్లియర్... ఆయన రాజీనామానే కారణం...

ఫురంధేశ్వరి(ఫైల్ ఫోటో)

విశాఖ లోక్ సభ స్థానం నుంచి గత ఎన్నికల్లో జనసేన నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేయగా... బీజేపీ తరపున పురంధేశ్వరి బరిలోకి దిగారు.

 • Share this:
  జనసేనకు ఆ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరైన లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఈ ప్రభావం జనసేన మీద ఏ మేరకు పడుతుందనే అంశం కాసేపు పక్కనపెడితే... ఆయన జనసేనకు గుడ్ బై చెప్పడం కారణంగా బీజేపీలోకి కీలక నేత, కేంద్ర మాజీమంత్రి పురంధేశ్వరికి లైన్ క్లియర్ అయ్యిందనే ప్రచారం బీజేపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. విశాఖ లోక్ సభ స్థానం నుంచి గత ఎన్నికల్లో జనసేన నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేయగా... బీజేపీ తరపున పురంధేశ్వరి బరిలోకి దిగారు. వీరిలో మూడో స్థానంలో లక్ష్మీనారాయణ, నాలుగో స్థానంలో పురంధేశ్వరి నిలిచారు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో... రాబోయే ఎన్నికల్లో విశాఖ లోక్ సభ సీటు ఎవరికి ఇస్తారనే దానిపై చర్చ జరిగింది.

  కొద్దిరోజుల క్రితం విశాఖ లోక్ సభ స్థానం జనసేన ఇంఛార్జ్‌గా లక్ష్మీనారాయణను జనసేన నియమించడంతో... మరోసారి ఆ సీటు ఆయనదే అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే పురంధేశ్వరి కోసం సిట్టింగ్ ఎంపీ కంభంపాటి హరిబాబును పక్కనపెట్టిన బీజేపీ... అంత ఈజీగా ఈ సీటును జనసేనకు వదులుతుందా అనే వాదన కూడా మొదలైంది. విశాఖ నుంచి పోటీ చేయడానికే గత కొన్నేళ్లుగా మొగ్గు చూపుతున్న పురంధేశ్వరి... రాబోయే ఎన్నికల్లోనూ విశాఖ వైపే మొగ్గుచూపుతారనే ప్రచారం కూడా జరుగుతోంది.

  లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి(ఫైల్ ఫోటో)


  అదే జరిగితే జనసేన నుంచి గత ఎన్నికల్లో విశాఖ ఎంపీ రేసులో నిలిచిన లక్ష్మీనారాయణకు సీటు దక్కే ఛాన్స్ లేనట్టే అనే గుసగుసలు కూడా వినిపించాయి. అయితే తాజాగా జనసేన నుంచి విశాఖ లోక్ సభకు పోటీ చేసిన లక్ష్మీనారాయణ బయటకు వెళ్లిపోవడంతో... ఈ సీటు మరోసారి బీజేపీ తరపున పురంధేశ్వరికి ఖాయమైనట్టే అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మొత్తానికి జనసేనకు లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పడంతో కేంద్ర మాజీమంత్రికి సీటు విషయంలో లైన్ క్లియర్ అయినట్టే భావించాలేమో.
  Published by:Kishore Akkaladevi
  First published: