ఏపీలో ఫోన్ సర్వేలు... బెట్టింగ్ రాయుళ్ల కొత్త ప్లాన్

పార్టీల గెలుపోటములు, అభ్యర్థుల జయాపజయాలు, నేతల మెజార్టీలపై బెట్టింగ్ రాయుళ్ల ఉత్సాహాన్ని క్యాష్ చేసుకునేందుకు బుకీలు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే పందేలు కాయడానికి ముందు బుకీలు ఫోన్ సర్వేల ద్వారా వాస్తవ ఫలితాలను అంచనా వేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: April 17, 2019, 3:39 PM IST
ఏపీలో ఫోన్ సర్వేలు... బెట్టింగ్ రాయుళ్ల కొత్త ప్లాన్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 17, 2019, 3:39 PM IST
ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాల కోసం అంతా మే 23 వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే ఫలితాలు ఏ రకంగా ఉంటాయనే దానిపై అప్పుడే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ గెలుపు గ్యారంటీ అని ఆ పార్టీ నేతలతో సహా పలువురు విశ్లేషిస్తుంటే... టీడీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగి కాయ్ రాజా కాయ్ అంటూ ఎన్నికల ఫలితాలపై పందేలు కాయడం మొదలుపెట్టారు. పార్టీల గెలుపోటములు, అభ్యర్థుల జయాపజయాలు, నేతల మెజార్టీలపై బెట్టింగ్ రాయుళ్ల ఉత్సాహాన్ని క్యాష్ చేసుకునేందుకు బుకీలు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

అయితే పందేలు కాయడానికి ముందు బుకీలు ఫోన్ సర్వేల ద్వారా వాస్తవ ఫలితాలను అంచనా వేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. బెట్టింగ్ రాయుళ్ల ఉత్సాహానికి తగ్గట్టుగా ఎవరిపై ఎంత పందెం వేయాలనే దానిపై బుకీలదే నిర్ణయం. అయితే ఇందుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు ఫోన్ ద్వారా సర్వేలు చేయించుకుంటున్నారట పలువురు బుకీలు. ఓటర్లకు ఫోన్ చేసి... మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు ? మీ ఓటు ఎవరికి వేశారు ? అనే అంశాలను తెలుసుకునేందుకు బుకీలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

నియోజకవర్గంలో దాదాపు సగానికిపైగా ఓటర్లకు ఈ రకంగా ఫోన్లు చేసి వారి సమాధానాలను బట్టి అభ్యర్థుల గెలుపోటములను అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. బెట్టింగ్ రాయుళ్ల సైతం ఇలాంటి సమాచారం తెలుసుకున్న తరువాతే పందేలు కాసేందుకు సిద్ధమవుతున్నారు. పలు కీలక నియోజకవర్గాల్లో ఇప్పటికే ఓటర్లకు ఫోన్ కాల్స్ రావడం కూడా మొదలైందని తెలుస్తోంది. మొత్తానికి ఏపీలో ఈసారి బెట్టింగ్ రాయుళ్లు కూడా సేఫ్‌గా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అర్థమవుతోంది.

First published: April 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...