Home /News /politics /

PUNJAB POLLS PM MODI SAY AAP IA PHOTOCOPY OF CONGRESS ONLY BJP CAN DEVELOP PUNJAB AT PATHANKOT RALLY MKS

Punjabలో డ్రగ్స్ వ్యాప్తికి వాళ్లే కారణం.. కాంగ్రెస్‌కు జిరాక్స్ కాపీనే ఆప్: PM Modi ఫైర్

పఠాన్ కోట్ సభలో ప్రధాని మోదీ

పఠాన్ కోట్ సభలో ప్రధాని మోదీ

వార్డు మెంబర్ నుంచి అసెంబ్లీ దాకా ప్రతి ఎన్నికలోనూ డ్రగ్స్ అంశం ప్రధాన చర్చగా ఉంటోంది. బుధవారం పఠాన్ కోట్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పంజాబ్ లో డ్రగ్స్ అంశాన్ని కీలకంగా ప్రస్తావించారు.

పాకిస్తాన్ సరిహద్దును ఆనుకొని ఉండే పంజాబ్ లో డ్రగ్స్ (Drugs In Punjab) అక్రమ రవాణా భారీ ఎత్తున సాగుతుండటం తెలిసిందే. దాదాపు ప్రతిరోజూ పాకిస్తాన్ నుంచి వచ్చే మాదకద్రవ్యాలు ఎక్కడోచోట పట్టుపడుతూ ఉంటాయి. పంజాబ్ లో మాదకద్రవ్యాల వినియోగంపై ‘ఉడ్తా పంజాబ్’లాంటి సినిమాలు కూడా వచ్చాయి. ప్రస్తుత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ (Punjab Assembly Election 2022) డ్రగ్స్ అంశం ప్రధాన చర్చగా ఉంటోంది. బుధవారం పఠాన్ కోట్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కూడా పంజాబ్ లో డ్రగ్స్ అంశాన్ని కీలకంగా ప్రస్తావించారు.

పంజాబ్ ఎన్నికల ప్రచారసభలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. పంజాబ్‌లో డ్రగ్స్ వ్యాప్తికి కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు. కాంగ్రెస్ పార్టీకి జిరాక్స్ కాపీ అయిన ఆప్.. ఢిల్లీలో యువతను మద్యం మత్తులో ముంచుతోందని విమర్శించారు. వెకిలి వ్యాఖ్యల ద్వారా ఆ రెండు పార్టీలూ భారత సైన్యం స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని ప్రధాని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు మరోసారి ఛాన్స్ ఇస్తే పంజాబ్‌ భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తుందన్న మోదీ.. బీజేపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు.

PM Modi Video: సంత్ రవిదాస్ భజనలో మోదీ.. మహిళలతో కలిసి కంజర వాయిస్తూ తాదాత్మ్యం


బీజేపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తే పంజాబ్ లో రాబోయే ఐదేళ్లలో వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు లాభసాటిగా మారుతాయని, అందుకు తనదే హామీ అని మోదీ అన్నారు. సంత్ రవిదాస్‌ ఆశయాలనే బీజేపీ కొనసాగిస్తుందని, పేదల సంక్షేమమే అన్నింటికంటే ఉన్నతమని వ్యాఖ్యానించారు. దేశ విభ‌జ‌న స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ సిక్కుల మ‌నోభావాల‌ను ప‌ట్టించుకోలేద‌ని మోదీ ఆరోపించారు. పాకిస్థాన్ లో ఉన్న గురు నాన‌క్ నిర్యాణ స్థ‌లం కర్తార్‌పూర్ సాహిబ్‌ను ఇండియా భూభాగంలోకి వ‌చ్చేలా కాంగ్రెస్ చ‌ర్య‌లు తీసుకోలేక‌పోయింద‌ని విమ‌ర్శించారు.

CM KCR యుద్ధానికి శివ సైన్యం మద్దతు -20న ఉద్ధ‌వ్‌తో కేసీఆర్ భేటీ -ఇవాళ ఫోన్‌లోనే అజెండా ఖరారు


మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీకి ఈనెల 20న పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డికానున్నాయి. పంజాబ్ లో ఆలస్యంగా ప్రచారం మొదలుపెట్టిన ప్రధాని మోదీ కేవలం మూడు సభల్లోనే పాల్గొనే పరిస్థితి. కాంగ్రెస్ బహిష్కృత నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. కాంగ్రెస్, ఆప్, శిరోమణి అకాలీదళ్ పార్టీలతో తలపడుతున్నది.
Published by:Madhu Kota
First published:

Tags: Assembly Election 2022, Bjp, Pm modi, Punjab

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు