హోమ్ /వార్తలు /National రాజకీయం /

Punjab new CM: పంజాబ్​ రాజకీయ ఉత్కంఠకు తెర.. కొత్త సీఎంగా దళిత ఎమ్మెల్యే ఎంపిక

Punjab new CM: పంజాబ్​ రాజకీయ ఉత్కంఠకు తెర.. కొత్త సీఎంగా దళిత ఎమ్మెల్యే ఎంపిక

చరంజీత్ ​సింగ్​ చన్నీ

చరంజీత్ ​సింగ్​ చన్నీ

గత రెండు రోజులుగా ఉత్కంఠకు దారితీసిన పంజాబ్ (Punjab)​ రాజకీయాలకు ఎట్టకేలకు తెరపడింది. కొత్త సీఎంగా ఎమ్మెల్యే చరంజీత్​​ సింగ్​ చాన్నీ (Charanjit Singh Channi) ఎంపికయ్యారు. కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన 24 గంటల్లోనే చరంజీత్​​ సింగ్​ చాన్నీ​ని ముఖ్యమంత్రి (chief minister)గా కాంగ్రెస్​ అధిష్టానం ఖరారు చేసింది

ఇంకా చదవండి ...

గత రెండు రోజులుగా ఉత్కంఠకు దారితీసిన పంజాబ్ (Punjab)​ రాజకీయాలకు ఎట్టకేలకు తెరపడింది. కొత్త సీఎంగా దళిత ఎమ్మెల్యే చరణ్​జీత్​​​ సింగ్​ చన్నీ (Charanjit Singh Channi) ఎంపికయ్యారు. కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన 24 గంటల్లోనే చరంజీత్​​ సింగ్​ చన్నీ​ని ముఖ్యమంత్రి (chief minister)గా కాంగ్రెస్​ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని కాంగ్రెస్​ అధిష్టానం చరణ్​జీత్​​​ సింగ్​​ చన్నీకి సమాచారం ఇవ్వడం.. ఆయన గవర్నర్​​ను ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాల్సిందిగా  కోరడానికి అపాయింట్​మెంట్​ అడగడం చకచకా జరిగిపోయాయి. కాగా, సీఎం రేసులో పీసీపీ చీఫ్​ నవ్యజోత్​ సింగ్​ సిద్దూ రేసులో ముందున్నా.. ఆయనకు పీసీసీ పగ్గాలు అప్పజెప్పడం.. కెప్టెన్​ అమరీందర్​ ఆయనకు వ్యతిరేకంగా ఉండటం కలిసిరాలేదు. దీంతో అధిష్టానం (high command) చరణ్​జీత్​​​ సింగ్​​ చన్నీ (Charanjit Singh Channi )​ వైపు మొగ్గు చూపింది.  ఈ మేరకు కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నేత హరీశ్​ రావుత్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

చరణ్​జీత్​​​ సింగ్​​​​​ గురించి కొన్ని విషయాలు..

చరణ్​జీత్​​​ సింగ్​​ చన్నీ. పంజాబ్ ప్రభుత్వంలో టెక్నికల్ ఎడ్యుకేషనల్ & ఇండస్ట్రియల్ ట్రైనింగ్ మంత్రిగా పనిచేశారు. చంకౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2015 నుంచి 2016 వరకు పంజాబ్ విధాన సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. చరణ్​జీత్​​​ సింగ్​​ రామదాసియా సిక్కు వర్గానికి చెందిన దళిత వ్యక్తి. 47 సంవత్సరాల వయస్సులో పంజాబ్ కెప్టెన్ అమరీందర్ సింగ్ క్యాబినెట్‌లో మంత్రిగా నియమితులయ్యారు. అయితే సోమవారం ఉదయం 11 గంటలకు చరణ్​జీత్​​​ సింగ్​​ ముఖ్యమంత్రి రాజ్​భవన్​లో ప్రమాణ స్వీకారం చేసి, పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది.

కాగా, కొత్త  సీఎం చరణ్​జీత్​​​ సింగ్​​కు మాజీ సీఎం అమరీందర్​ సైతం శుభాకాంక్షలు తెలిపారు.  ‘‘సరిహద్దు రాష్ట్రం నుంచి పంజాబ్‌ని సురక్షితంగా ఉంచుతూ , సరిహద్దుల నుంచి పెరుగుతున్న భద్రతా ముప్పు నుంచి ప్రజలను కాపాడగలరని నేను ఆశిస్తున్నాను”అని తెలిపారు.


చరణ్​జీత్​​​ సింగ్​​పై మీటూ కేసు ఉంది :  బీజేపీ

కాగా, చరణ్​జీత్​​​ సింగ్​​ను పంజాబ్​కు కొత్త సీఎంగా ప్రకటించడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఆయనపై ఇదివరకే మీటూ కేసు ఉన్నట్లు గుర్తుచేసింది. బీజేపీ నాయకుడు అమిత్​ మాల్వియా దీనిపై ఓ ట్విట్​ చేశారు.

‘‘ కాంగ్రెస్​ కొత్త సీఎంగా ఎన్నికైన చరణ్​జీత్​​​ సింగ్​ చన్నీ 3 సంవత్సరాల క్రితం  #MeToo కేసులో చర్యను ఎదుర్కొన్నారు. అతను 2018 లో ఒక మహిళా IAS అధికారికి అసభ్యకర సందేశాలు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ విషయాన్ని కప్పిపుచ్చారు. కానీ పంజాబ్ మహిళా కమిషన్ నోటీసు పంపడంతో కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. బాగా చేశారు, రాహుల్.” అని తన పోస్టులో రాసుకొచ్చారు.

First published:

Tags: Congress, Politics, Punjab

ఉత్తమ కథలు