Home /News /politics /

PUNJAB ELECTIONS 2022 SONU SOOD SISTER MALVIKA SOOD TRAILING FROM CONGRESS AAP LEADING TA

Sonu Sood : పంజాబ్‌లోని మోగా నియోజకవర్గంలో సోనూ సూద్ సోదరి మాళవిక వెనుకంజ..

పంజాబ్‌లోని మోగా నుంచి సోనూ సూద్ సోదరి వెనకంజ (File/Photo)

పంజాబ్‌లోని మోగా నుంచి సోనూ సూద్ సోదరి వెనకంజ (File/Photo)

Sonu Sood : రైతుల ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉండిన పంజాబ్‌లో ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిగా పోటీ చేసిన సోనూ సూద్ సోదరి మాళవిక .. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధి కంటే వెనకంజలో ఉన్నారు.

ఇంకా చదవండి ...
    Sonu Sood : రైతుల ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉండిన పంజాబ్‌లో ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో సీఎం చన్ని, పీసీసీ సారథి సిద్దూ మధ్య ఆజ్యం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. మరోవైపు మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న అమరేందర్ సింగ్ కొత్త పార్టీ పెట్డంతో పాటు ఆయన బీజేపీతో పోటీ చేయడం లాంటివి కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బ తీసాయనే చెప్పాలి. తాజాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన సోనూ సూద్ చెల్లెలు మాల్వికా సూద్ సచార్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాదు అక్కడ నుంచి మోగా నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో దిగారు. కరోనా సమయంలో సోనూ చేసిన సామాజిక సేవలో కీలక భూమిక పోషించిన మాల్విక కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్‌కు కలిసొస్తోందని అందరు అనుకున్నారు.

    కానీ అనూహ్యంగా మోగా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సోనూ సోదరి మాల్విక.. సమీప ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధి డాక్టర్ అమర్‌దీప్ కౌర్ అరోరా చేతిలో వెనకబడ్డారు. ఫలితాల సరళి చూస్తుంటే.. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ .. మ్యాజిక్ ఫిగర్ 59ని దాటి.. 85 పైగా స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.  ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ వెనుకంజలో ఉన్నారు. పాటియాలా అర్బ‌న్ నుంచి పోటీ చేసిన పంజాబ్ మాజీ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ వెనుకంజ‌లో ఉన్నారు. లంబీ స్థానం నుంచి పోటీ చేసిన ప్ర‌కాశ్ సింగ్ బాద‌ల్ వెనుకంజ‌లో ఉన్నారు. శిరోమ‌నీ అకాలీద‌ళ్ నేత గ‌నివీ కౌర్ మంజిత లీడింగ్‌లో ఉన్నారు.

    UP Result 2022: యూపీలో వార్ వన్ సైడ్.. మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ.. బీఎస్పీ సీట్లు చూస్తే షాకవుతారు!

    ఎన్నికల ప్రచారంలో అదరగొట్టిన పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ సైతం అమృత్ సర్ స్థానంలో వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ లో సీఎంల మార్పు, అవినీతి ఆరోపణలు పార్టీ కొంపముంచినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 19 సీట్లు సాధించి బలమైన ప్రతిపక్షంగా నిలబడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ.. గడిచిన 5ఏళ్లు పంజాబ్ లో క్రమంగా విస్తరిస్తూ ఇవాళ జయకేతనం దిశగా వెళుతోంది. ఆప్ సీఎం అభ్యర్థి భగవత్ మాన్ ముందంజలో ఉన్నారు.మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 19న ఒకే విడతలో  పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Punjab Assembly Elections 2022, Sonu Sood, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు