PUNJAB ELECTION RESULTS LIVE UPDATES SIDHU CALLS CONGRESS LEGISLATIVE PARTY MEET ON COUNTING DAY HERE IS WHY BA
Punjab Election Results Live Updates: ఎన్నికల కౌంటింగ్ వేళ సిద్ధూ కీలక నిర్ణయం.. ముందు జాగ్రత్త
సిద్ధు (Photo Credit:Twitter)
Punjab Election Result 2022 in Telugu | పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావొచ్చని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పరిశీలకులు అజయ్ మాకెన్, పంజాబ్ కాంగ్రెస్ ఇన్ చార్జి హరీశ్ చౌదరితో సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
Punjab election Result Latest News: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడే వేళ పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన వెంటనే గెలిచిన అభ్యర్థులు అందరూ పార్టీ ఆఫీసుకు రావాలని సూచించారు. మార్చి 10వ తేదీ సాయంత్రం 5 గంటలకు పంజాబ్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గెలిచిన వారంతా వచ్చి కొత్త సీఎల్పీని ఎన్నుకోవాలని ఇక్కడ ప్లాన్ చేశారు. అయితే, ఇదంతా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే చేసినట్టు రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఒకవేళ పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి కావాల్సినంత మెజారిటీ రాకపోతే గెలిచిన వారిని ఇతర పార్టీలు తన్నుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని కాపాడుకోవడానికి సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావొచ్చని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పరిశీలకులు అజయ్ మాకెన్, పంజాబ్ కాంగ్రెస్ ఇన్ చార్జి హరీశ్ చౌదరితో సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 10వ తేదీ సాయంత్రం 5 గంటలకు చండీగఢ్‌లో సీఎల్పీ సమావేశానికి గెలిచిన ఎమ్మెల్యేలు హాజరుకావాలని సిద్ధు ట్వీట్ చేశారు.
It has been decided that the First Congress Legislative Party meeting will be held on 10th March at PPCC office (Congress Bhawan, Sector 15) at 5PM.
అన్ని ఎగ్జిట్ పోల్స్ ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టాయి. Axis my india నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కాంగ్రెస్‌కు 19- 31 సీట్లు, ఆప్‌కు 76 90 సీట్లు, శిరోమణి ఆకాళీదల్కు 7- 11 ‘సీట్లు, బీజేపీకి 1- 4 సీట్లు రావొచ్చని పేర్కొంది. సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ సైతం పంజాబ్‌లో అధికారం ఆప్కే దక్కొచ్చని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీకి 41-49 సీట్లు, ఆప్‌కు 59-57 సీట్లు, బీజేపీ, శిరోమణి అకాళీదళ్ వంటి పార్టీలకు 3-13 సీట్లు రావొచ్చని అభిప్రాయపడింది.
టుడే చాణక్య ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం కాంగ్రెస్‌కు 54, ఆప్‌కు 54 ఇతరులకు 9 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎంఆర్సీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం కాంగ్రెస్‌కు 55, ఆప్‌కు 55, ఇతరులకు 7 సీట్లు రావొచ్చని వెల్లడైంది. మొత్తానికి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, ఆప్ మధ్యే ఉంటుందని.. ఇందులో ఆప్ అదికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.