Home /News /politics /

PUNJAB ELECTION RESULTS 2022 LIVE UPDATES BHAGWANT MANN TO BE NEXT PUNJAB CM AS AAP SWEEPS WITH HUGE MAJORITY MKS

Punjab Results 2022: తాగుబోతని తిట్టిపోశారు.. ఇప్పుడాయనే సీఎం అయ్యారు!.. Bhagwant Mann

పంజాబ్ కాబోయే సీఎం భగవత్ మాన్

పంజాబ్ కాబోయే సీఎం భగవత్ మాన్

‘అతనో పచ్చి తాగుబోతు.. డ్రగ్స్ కూడా వాడతాడు.. నిత్యం నిషాలో జోగుతుండే మాన్ ను గనుక గెలిపిస్తే పంజాబ్ మొత్తాన్నీ మత్తులో ముంచేస్తాడు.. ’ ఇదీ.. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు భగవత్ మాన్ పై చేసిన ఆరోపణ.

‘అతనో పచ్చి తాగుబోతు.. డ్రగ్స్ కూడా వాడతాడు.. నిత్యం నిషాలో జోగుతుండే మాన్ ను గనుక గెలిపిస్తే పంజాబ్ మొత్తాన్నీ మత్తులో ముంచేస్తాడు.. ’ ఇదీ.. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు భగవత్ మాన్ పై చేసిన ఆరోపణ. స్టాండప్ కమెడియన్ గా పాపులరై, ఆప్ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి, ఎంపీగా గెలుపొంది, ఓ సందర్భంలో తాగేసి పార్లమెంటుకు వచ్చారని ఆరోపణలు ఎదుర్కొన్న భగవత్ మాన్ ఇప్పుడు పంజాబ్ తదుపరి ముఖ్యమంత్రి కాబోతున్నారు. గురువారం వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుండగా.. పంజాబ్ లో ఎవరూ ఊహించని రీతిలో ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు అన్ని సీట్లను ఊడ్చిపారేసింది. ఆప్ సీఎం అభ్యర్థిగా భగవత్ మాన్ ముఖ్యపీఠంపై కూర్చునేందుకు రంగం సిద్ధమైంది..

మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 20న ఒకే దశలో పోలింగ్ జరగ్గా, ఐదు రాష్ట్రాలతోపాటే ఇవాళ ఫలితాలు వెలువడ్డాయి. కౌంటింగ్ ఇంకా కొనసాగుతున్న క్రమంలో ఇప్పటిదాకా అందిన సమాచారం మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ అసాధారణ మెజార్టీతో దూసుకుపోతున్నది. ఆప్ ఏకంగా 85 సీట్లలో లీడ్ లో కొనసాగుతున్నది. అధికార కాంగ్రెస్ చావుదెబ్బతిని కేవలం 16 సీట్లలోనే ఆధిక్యంలో ఉంది. శిరోమణి అకాలీదళ్ 9 సీట్లలో, బీజేపీ-అమరీందర్ కూటమి 6 స్థానాల్లో లీడింగ్ లో ఉంది.

UP Result 2022: యూపీలో వార్ వన్ సైడ్.. మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ.. బీఎస్పీ సీట్లు చూస్తే షాకవుతారు!


ఈ ఏడాది జనవరి 18న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒకప్పటి స్టాండప్ కమెడియన్, ప్రస్తుత ఆప్ ఎంపీ భగవత్ మాన్ పేరును ప్రకటించింది. ప్రజాభిప్రాయాన్ని బట్టి సీఎం అభ్యర్థిని ఎంపిక చేశామని, వాట్సాప్, మిస్డ్ కాల్, ఎస్సెమ్మెస్ తదితర మార్గాల్లో ప్రజలు తమ ప్రియతమ నేతను సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నారని, భగవంత్ మాన్‌కు 93.3 శాతం మంది మద్దతు పలికారని ఆ సందర్భంలో కేజ్రీవాల్ చెప్పారు. ఆప్ అంచనాలు నిజమవుతూ పంజాబ్ ఫలితాల్లో ఆపార్టీ విజయదుందుభికి సిద్దమైంది.

Election 2022 Results : ఈవీఎంల గోల్‌మాల్ వట్టిదే.. ఈసీ ఏ పార్టీకీ తొత్తుకాదు :CEC Sushil Chandra


పంజాబీ స్టాండప్ కమెడియన్ గా గుర్తింపు పొందిన భగవంత్ మాన్ 2014 మార్చిలో ఆప్‌లో చేరారు. 2014, 2019లలో సంగ్రూర్ లోక్ సభ నియోజక వర్గం నుంచి ఆప్ ఎంపీగా వరుస విజయాలు సాధించారు. ప్రస్తుతం పంజాబ్ ఆప్ శాఖకు కూడా మాన్ చీఫ్ గా ఉన్నారు. ‘ఒకప్పుడు జనం నన్ను చూసి తెగ నవ్వేవారు. కానీ ఇప్పుడు అందరూ రోదిస్తున్నారు. తమను కాపాడమని కోరుతున్నారు’అని సీఎం అభ్యర్థిగా ఎంపికైన రోజు మాన్ వ్యాఖ్యానించారు. తాగుబోతు అనే విమర్శపై స్పందిస్తూ మద్యం మానేశానని, ప్రజాప్రతినిధిగా, పంజాబ్ సీఎంగా బాధ్యతగా మసలుకుంటానని ఎన్నికల ప్రచారంలో మాన్ ప్రజలకు చెప్పారు.
Published by:Madhu Kota
First published:

Tags: AAP, Assembly Election 2022, Punjab

తదుపరి వార్తలు