Home /News /politics /

PUNJAB ELECTION RESULTS 2022 LABORER SON LAB SINGH DEFEATED CM CHANNI AAP KEJRIWAL CALLS IT INCREDIBLE INQUILAB MKS

సీఎంను ఓడించిన స్వీపర్ కొడుకు: పంజాబ్‌లో సంచలనం.. ఇక దేశాన్ని ఊడ్చేస్తామంటూ..

సీఎంను ఓడించిన స్వీపర్ కొడుకు లాభ్ సింగ్

సీఎంను ఓడించిన స్వీపర్ కొడుకు లాభ్ సింగ్

ఓ స్వీపర్ కొడుకు ఎన్నికల్లో ఏకంగా సీఎంనే స్వీప్ చేసిన దృశ్యం పంజాబ్ లో చోటుచేసుకుంది. ఆప్ అసాధారణ విజయంపై ఆ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన చేతిలోని నాలుగు స్థానాలనూ కాపాడుకోగా, సైలెంట్ కిల్లర్ గా, ఎన్నికల్లో ఏకైక గెయినర్ నిలిచింది ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్). ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, యూపీలో బీజేపీ 264 సీట్లలో మెజార్టీతో విజయం దాదాపు ఖరారు చేసుకోగా, పంజాబ్ ను ఆప్ క్లీన్ స్వీప్ చేస్తూ ఏకంగా 93 సీట్లు కొల్లగొట్టేసింది. ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలనూ బీజేపీ ప్రభుత్వాలే ఖాయమయ్యాయి. దేశంలో ఇప్పటిదాకా ఏ ప్రాంతీయ పార్టీ సాధించలేని రీతిలో ఆప్ రెండో రాష్ట్రం(పంజాబ్)లో ఘన విజయం సాధించడానికి గల కారణాలు, ఎన్నికల్లో హైలైట్లు, పంజాబ్ లో ఆప్ ఏం చేయబోతోందో.. కొత్తగా దక్కిన జాతీయ హోదాతో దేశ రాజకీయాలను ఎలా మలుపుతిప్పబోతున్నదో ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వివరించారు. ఢిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాలయం వద్ద శ్రేణుల్ని ఉద్దేశించి కేజ్రీవాల్ సంచలన స్పీచ్ ఇచ్చారు..

ఢిల్లీలో పుట్టిన విప్లవాగ్నిని ఇప్పుడు పంజాబ్ అందిపుచ్చుకుందని, ఇలాంటి ఇక్రెడబుల్ ఇక్విలాబ్(అద్భుతమైన విప్లవం) దేశమంతటా విస్తరించాల్సిన అవసరం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. జ్రీవాల్ టెర్రరిస్టు కాదని పంజాబ్ ప్రజలు రుజువు చేశారని, బడా శక్తుల కుట్రలను పంజాబీలు ఛేదించారని, ద్వేషంతో కాకుండా ప్రేమతో కూడిన రాజకీయాలు చేయాలన్న ఆప్ విలువలను ప్రజలే కాపాడారని ఆయన చెప్పారు.

సైలెంట్ కిల్లర్ Kejriwal: ఏ ప్రాంతీయ పార్టీకీ సాధ్యంకానిది.. KCR హడావుడి, Mamata గర్జనకు భిన్నంగా..


‘కేజ్రీవాల్‌ టెర్రరిస్టుల మద్దతుదారుఅని, టెర్రరిస్టే అని ఎన్నికల ప్రచారంలో చాలా మంది అన్నారు. పెద్ద శక్తులన్నీ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఒక్కటయ్యాయి. ఎన్నో కుట్రలు చేశాయి. కానీ కేజ్రీవాల్ ఉగ్రవాది కాదని.. ఈ దేశానికి నిజమైన కుమారుడని ఈ ఫలితాల ద్వారా పంజాబ్ ప్రజలు నిరూపించారు. రైతుల నుంచి వ్యాపారుల దాకా సామాన్యులు ప్రతిఒక్కరూ ఆప్ లో చేరాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే...

Punjab: చీపురు దెబ్బ: సిద్దు ఓటమి.. పీసీసీకి రాజీనామా.. తల్లిని పట్టుకొని ఏడ్చేసిన కాబోయే సీఎం


సామాన్యులు ఆప్ లో చేరితే ఏం జరుగుతుందో పంజాబ్ ఎన్నికల్లో ప్రత్యక్ష ఉదాహరణలెన్నో ఉన్నాయి. పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్ని ఓడించింది ఎవరో తెలుసా? ఒక పారిశుద్ధ్య కార్మికురాలి కొడుకు. అవును, స్వీపర్ కొడుకు సీఎంను ఊడ్చేశాడు. అతని పేరు లాభ్ సింగ్. భదౌర్ నియోజకవర్గంలో ఆప్ విజేత లాభ్ సింగ్ మొబైల్ రిపేర్ షాపులో పనిచేసే ఆమ్ ఆద్మీ. అతని తల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో క్లీనర్‌గా పనిచేస్తోంది. అతడి తండ్రి వ్యసాయ కూలి. ఈ ఒక్క ఉదాహరణ చాలదా? ఆప్ లో చేరితే సామాన్యులు ఏం చేయగలరో..’అని కేజ్రీవాల్ అన్నారు.

BJP తర్వాతి టార్గెట్ KCR: యూపీ బుల్డోజర్లు తెలంగాణకూ వస్తాయి.. ముందస్తు ప్లాన్ చెప్పేసిన నేత


బ్రిటిషర్లు పోయినా, వాళ్లు నెలకొల్పిన వ్యవస్థలను కూల్చనిదే ఇండియాలో మార్పు రాబోదని భగత్ సింగ్ ఓ సందర్బంలో చెప్పారని, దురదృష్టవశాత్తు గత 75 ఏళ్లల్లో పరిపాలన చేసిన పార్టీలన్నీ బ్రిటిష్ వ్యవస్థలనే అమలు చేశాయని, కాబట్టే ఇవాళ భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ లాంటి దేశాలకు వెళ్లి చదువుకొనే దుస్థితి నెలకొందని కేజ్రీవాల్ అన్నారు. ‘మనోళ్లు ఉక్రెయిన్ వెళ్లడం కాదు.. విదేశీయులే ఇండియాకు వచ్చి చదువుకునేలా మార్పు రావాలి. ఇప్పటికే 75 ఏళ్లు వృద్ధా అయ్యాయి. ఇంకా ఎదురుచూపులు వద్దు. మార్పు కోసం అందరం కలిసి పోరాడుదాం’అని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
Published by:Madhu Kota
First published:

Tags: AAP, Aravind Kejriwal, Assembly Election 2022, Punjab

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు