Home /News /politics /

PUNJAB ELECTION 2022 AKALI DEPLOYS BIKRAM SINGH MAJITHIA AGAINST PCC CHIEF NAVJOT SINGH SIDHU IN AMRITSAR EAST MKS

Punjab Election 2022: అమృత్‌సర్(ఈస్ట్)‌లో బిగ్ ఫైట్ -సిద్దూపై పోటీకి బిక్రమ్ సింగ్ -అకాలీ అనూహ్య ఎత్తుగడ

బిక్రమ్ సింగ్ వర్సెస్ నవజ్యోత్ సిద్దూ

బిక్రమ్ సింగ్ వర్సెస్ నవజ్యోత్ సిద్దూ

అమృత్‌సర్ (ఈస్ట్) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న పీపీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్‌ సిద్ధూపై శిరోమణి అకాలీదళ్ తమ అభ్యర్థిగా మాజీ మంత్రి బిక్రం సింగ్ మజిథియాను బరిలోకి దింపింది. దీంతో అక్కడ బిగ్ ఫైట్ నెలకొంది..

పంజాబ్ లో అధికార కాంగ్రెస్ పార్టీకి విపక్ష శిరోమణి అకాలీదళ్ (సాద్) సంచలన సవాలు విసిరింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను ఓడించి తీరుతామన్న అకాలీ.. ఆ మేరకు అనూహ్య పాచిక వేసింది. అమృత్‌సర్ (ఈస్ట్) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న పీపీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్‌ సిద్ధూపై శిరోమణి అకాలీదళ్ తమ అభ్యర్థిగా మాజీ మంత్రి బిక్రం సింగ్ మజిథియాను బరిలోకి దింపింది. పంజాబ్ లో పార్టీలకు అతీతంగా పాపులారిటీ ఉన్న నేతల్లో బిక్రమ్ ఒకరు. దీంతో అమృత్‌సర్ (ఈస్ట్) స్థానంలో బిగ్ ఫైట్ నెలకొంది.

అమృత్‌సర్ (ఈస్ట్) నుంచి అకాలీ దళ్ అభ్యర్థిగా బిక్రమ్ సింగ్ మజిథియాను బరిలోకి దింపుతున్నట్టు ఆ పార్టీ చీఫ్, మాజీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్ బుధవారంనాడు ప్రకటించారు. తమ అభ్యర్థి గెలుపు ఖాయమన్నారు. ''నువ్వు (సిద్ధూ) ఎంత గట్టిగా ప్రయత్నించినా నెగ్గలేవు'' అని సిద్ధూకు, కాంగ్రెస్ పార్టీకి ఆయన బహిరంగ సవాలు విసిరారు.

Paracetamol Kills Snakes: పారాసిటమల్‌తో పాములను చంపుతున్నారు -Dolo 650 దట్టించిన ఎలుకల్ని విసిరి..


పంజాబీ ప్రజలు ఎవరి వెనక ఉన్నారో తాము చెప్పదలచుకున్నామని, తప్పుడు ప్రచారం, తప్పుడు ఆరోపణలు చేయడం మినహా ఆయనకు (సిద్ధూ)కు పనేమీ లేదని బాదల్ విమర్శించారు. దాదాపు 40 ఏళ్లు బీజేపీ భాగస్వామిగా ఉన్న అకాలీదళ్.. సాగు చట్టాల విషయంలో తేడాలు రావడంతో ఎన్డీఏ నుంచి వైదొలగింది. కాగా, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్‌వాదీ పార్టీతో అకాలీ దళ్ పొత్తు పెట్టుకుంది. బీఎస్‌పీ 20 సీట్లలో అభ్యర్థులను నిలబెడుతుండగా, తక్కిన సీట్లలో అకాలీ అభ్యర్థులు ఉంటారు.

Omicron: మన చర్మంపై ఒమిక్రాన్‌ ఎన్ని గంటలు బతికి ఉంటుందో తెలుసా? షాకింగ్ విషయాలు చెప్పిన సైంటిస్టులు..


2017 అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్‌సర్ ఈస్ట్ నుంచి సిద్ధూ 60,477 ఓట్లతో గెలిచారు. సాద్-బీజేపీ అభ్యర్థి రాకేష్ కుమార్ హనీ 17,668 ఓట్లతో రెండో స్థానంలోనూ, ఆప్ అభ్యర్థి సరజ్‌జిత్ సింగ్ ధాంజల్ 14,715 ఓట్లతో మూడు స్థానంలోనూ నిలిచారు. 42,661 ఓట్ల తేడాతో సిద్ధూ గెలుపొందారు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 117 నియోజకవర్గాలకు గాను ఫిబ్రవరి 20న ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Assembly Election 2022, Congress, Navjot Singh Sidhu, Punjab

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు