Punjab Congress Crisis: పంజాబ్ కాంగ్రెస్‌లో ముదిరిన సంక్షోభం.. రాజీనామాకు రెడీ అయిన అమరీందర్ సింగ్..!

అమరీందర్ సింగ్, నవ్‌జోత్ సింగ్ సిద్దు (ఫైలో ఫొటో)

పంజాబ్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న సంక్షోభం మరింతగా ముదిరింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ తన పదవి నుంచి తప్పుకోవడానికి సిద్దమైనట్టుగా సమాచారం.

  • Share this:
    పంజాబ్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న సంక్షోభం(Punjab Congress Crisis) మరింతగా ముదిరింది. తాను రాజీనామా చేయనున్నట్టుగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్(Amarinder Singh) తన స్నేహితులతో చెప్పినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆయన ఈ రోజే గవర్నర్‌కు తన రాజీనామా లేఖను అందించే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలో చర్చ జరుగుతోంది. పంజాబ్ కాంగ్రెస్ ఇంచార్జ్ హరీష్ రావత్ (Harish Rawat) అర్ధరాత్రి చేసిన ట్వీట్‌తో పంజాబ్‌ కాంగ్రెస్‌లో పరిణామాలు వేగంగా మారిపోయాడు. సెప్టెంబర్ 18 కాంగ్రెస్ శాసనసభపక్ష సమావేశం జరగనుంది.. ప్రతి ఒక్కరు హాజరు కావాలని కోరారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దు కూడా పార్టీ ఎమ్మెల్యేలకు ఇదే రకమైన ఆదేశాలు జారీచేశారు.

    నేడు కాంగ్రెస్ శాసనసభపక్ష సమావేశం జరగనున్న వేళ.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) అమరీందర్ సింగ్‌తో మాట్లాడినట్టుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే సీఎం పదవి నుంచి తప్పుకోవాలని పార్టీ అధిష్టానం అమరీందర్ సింగ్‌ను కోరినట్టుగా ఆ వర్గాలు చెప్పాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే దీని వెనక కొద్ది రోజులుగా పార్టీ అధిష్టానం భారీ కసరత్తు చేసినట్టుగా తెలిసింది.

    ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష సమావేశంలో కొత్త సారథిని ఎనుకోనున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలు అజయ్ మాకెన్, హరీష్ చౌదరిలు ఢిల్లీ నుంచి పంజాబ్‌కు బయలుదేరారు. మరోవైపు ఈరోజు జరిగే సమావేశం కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా నవజ్యోత్ సింగ్ సిద్దుని(Navjot Singh Sidhu) గానీ, సునీల్ జాఖా ని(Sunil Jakha) గానీ ఎన్నుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    గత కొంతకాలంగా పంజాబ్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమరీందర్ సింగ్‌కు వ్యతిరేక వర్గంగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు 40 మంది వరకు అధిష్టానానికి ఓ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల వ్యూహాన్ని రూపొందించడానికి సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని వారు లేఖలో డిమాండ్ చేశారు. ఇక, పార్టీలో గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలతో అమరీందర్ సింగ్ విసిగిపోయాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: