Home /News /politics /

PUNJAB CONGRESS CRISIS NAVJOT SINGH SIDHU HAS CONNECTION WITH PAKISTAN IF HE BECOMES IT WILL BE A THREAT TO NATION SAYS SAYS AMARINDER SINGH SK

Punjab Crisis: అతడికి పాకిస్తాన్‌తో సంబంధాలు.. సీఎం అయితే సర్వనాశనం.. అమరీందర్ సంచలన వ్యాఖ్యలు

అమరీందర్ సింగ్, నవ్‌జోత్ సింగ్ సిద్దు (ఫైలో ఫొటో)

అమరీందర్ సింగ్, నవ్‌జోత్ సింగ్ సిద్దు (ఫైలో ఫొటో)

Punjab Crisis: సీఎం పదవి సిక్కుయేతర వ్యక్తికి ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే సునీల్​ జాఖర్ (Sunil jakhar)​ పేరు తెరపైకి వచ్చింది. సునీల్​ను సీఎంగా ఎన్నుకుంటారని రాజకీయ వర్గాల్లో వార్తలు ఊపందుకున్నాయి.

  పంజాబ్ రాజకీయాలు  (Punjab politics)ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. సిద్దూ (Navjot singh sidhu) వర్సెస్ అమరీందర్ (Captain Amarinder singh) వ్యవహారం చివరకు రాజకీయ సంక్షోభానికి దారి తీసింది. సిద్దూతో విభేదాల కారణంగా కెప్టెన్ అమరీందర్ సీఎం పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఐతే సీఎం పదవి నుంచి దిగిపోతూ.. పంజాబ్ పీసీసీ చీఫ్ నవ్‌జోత్ సింగ్ సిద్దూపై కెప్టెన్ అమరీందర్ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దూ అసమర్థుడని.. ఆయన డిజాస్టర్‌గా మిగిలిపోతాడని విమర్శించారు. పాకిస్తాన్‌ (Pakistan) ప్రధాని, ఆర్మీ చీఫ్‌తో సంబంధాలున్న వ్యక్తిని పంజాబ్ సీఎం చేస్తానంటే తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు కెప్టెన్ అమరీందర్ సింగ్. ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  '' నవ్‌జోత్ సింగ్ సిద్దూ గురించి నాకు పూర్తిగా తెలుసు. అతడు అసమర్థుడు. డిజాస్టర్‌గా మిగిలిపోతాడు. కాంగ్రెస్ పార్టీ అతడిని పీసీసీ అధ్యక్షుడిని చేసింది. అంత వరకు ఓకే. కానీ సీఎం చేస్తానంటే నేను గట్టిగా వ్యతిరేకిస్తాను.  ఎందుకంటే ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. అతడికి పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాలున్నాయో నాకు తెలుసు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్,ఆ దేశ ఆర్మీ చీఫ్ బజ్వా సిద్దూకు స్నేహితులు.  పాకిస్తాన్ సరిహద్దు నుంచి పంజాబ్‌కు  నిత్యం డ్రోన్లు,పేలుడు పదార్థాలు,మాదక ద్రవ్యాలు,  గ్రేనేడ్లు, ఆర్డీఎక్స్  తుపాకులు వస్తుంటాయి.  పంజాబ్‌కు పాకిస్తాన్‌తో 600కి.మీ బోర్డర్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ అగ్రనేతలతో సంబంధాలున్న వ్యక్తిని సీఎంగా చేస్తే అది దేశభద్రతకే పెద్ద ముప్పు. అందుకే నేను వ్యతిరేకిస్తా'' అని కెప్టెన్ అమరీందర్ సింగ్ పేర్కొన్నారు.

  One Rupee Coin: ఒక్క పాత రూపాయి నాణెం ఎంత ధర పలికిందో తెలుసా.. వివరాలిలా..  బాలీవుడ్​ నటుడు సోనూసూద్​ ఇళ్లల్లో తనిఖీలపై ఐటీ శాఖ ప్రకటన.. దాడులు

  కాగా, పంజాబ్ సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారం రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించారు. కాంగ్రెస్ శాసనసభపక్ష సమావేశానికి కొద్ది గంటల ముందు ఆయన రాజీనామ చేశారు. అమరీందర్ సింగ్‌ పాలనపై సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారు. సీఎంను మార్చాలని హైకమాండ్‌పై ఒత్తిడి తేవడంతో శనివారం సీఎల్పీ భేటీ నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సోనియా గాంధీ ఆదేశాల మేరకు కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేయక తప్పలేదు. పార్టీలో తనకు ఎన్నోసార్లు అవమానాలు ఎదురయ్యాయని రాజీనామా అనంతరం వాపోయారు అమరీందర్ సింగ్. కొత్త సీఎంగా ఎవరిని ఎన్నుకుంటారో తనకు తెలియదని అన్నారు. తన సన్నిహితులు, కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

  Covid-19 Poverty: 31 మిలియన్ల మందిని కటిక పేదరికంలోకి నెట్టిన కరోనా..

  వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త సీఎం ఎవరన్న దానిపై కాంగ్రెస్ హైకమాండ్ ఆచితూచి వ్యహరిస్తోంది. పీసీసీ చీఫ్ పదవి, ముఖ్యమంత్రి పదవులను ఒకే వర్గానికి కాకుండా ఇరు వర్గాలకు కేటాయించాలని కాంగ్రెస్​ పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగానే పీసీసీ చీఫ్ పదవి నవ్యజోత్​ సింగ్​ సిద్ధూకు ఇచ్చేశారు. ఇక సీఎం పదవి సిక్కుయేతర వ్యక్తికి ఇవ్వాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే సునీల్​ జాఖర్ (Sunil jakhar)​ పేరు తెరపైకి వచ్చింది. సునీల్​ను సీఎంగా ఎన్నుకుంటారని రాజకీయ వర్గాల్లో వార్తలు ఊపందుకున్నాయి.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Congress, Navjot Sidhu, Navjot Singh Sidhu, Punjab

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు