PUNJAB CONGRESS CRISIS MLA NAVJOT SINGH SIDHU MEET RAHUL AND PRIYANAKA GANDHI NGS
Punjab: పీక్ కు చేరిన పంజాబ్ కాంగ్రెస్ పంచాయితీ.? రాహుల్, ప్రియాంకాతో సిద్ధు సమావేశం
సిద్ధు, ప్రియాంకా గాంధీ
వరుస ఓటములతో ఢీల పడుతున్న కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. త్వరలో ఎన్నికలు జరగనున్న పంజాబ్ లో కాంగ్రెస్ వర్గ పోరు ముదిరింది. తాజాగా ఎమ్మెల్యే సిద్ధు పార్టీ పెద్దలు రాహుల్, ప్రియాంకాలను కలవడం హాట్ టాపిక్ గా మారింది.
పంజాబ్ కాంగ్రెస్ లో విబేధాలు తారా స్థాయికి చేరాయి. ఇలాంటి సమయంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత, అమృతసర్ ఎమ్మెల్యే నవ్‌జోత్ సింగ్ సిద్ధు.. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాలను కలవడం పంజాబ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, అసంతృప్త నేత నవ్‌జోత్ సింగ్ సిద్ధూ వర్గాల మధ్య విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం దిద్దుబాటు చర్యలకు దిగింది. అయితే అంతకుముందు నాకీయ పరిణమాలు చోటు చేసుకున్నాయి. మొదట తాను వెళ్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుస్తానని సిద్ధు ప్రకటించిన కాసేపటికే.. రాహుల్ మాత్రం ‘సిద్ధూతో సమావేశం ఉండదు’ అని మీడియాతో చెప్పారు. దీంతో సిద్ధూ వర్గానికి గట్టి షాక్ తగిలినట్టుయింది. కానీ అంతలోనే మరో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం ప్రియాంకాతో సుదీర్ఘ సమావేశం జరిగిందని వెల్లడిస్తూ.. ఆమెతో దిగిన ఫొటోను సిద్ధు తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ సమావేశం 4 గంటలపాటు జరిగిందని చెప్పారు. అయితే సిద్ధూతో సమావేశం ఉండదని రాహుల్ గాంధీ చెప్పిన మరుసటి రోజే ఆయన ప్రియాంకాను కలవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగానే.. ప్రియాంకను కలిసిన తర్వాత ఢిల్లీలోని రాహుల్ గాంధీతో కూడా ఆయన నివాసంలో సిద్ధూ సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశాలకు సంబంధించిన వివరాలేను సిద్ధు వర్గం బహిర్గతం చేయడం లేదు.
పంజాబ్ కాంగ్రెస్‌లో తలెత్తిన విభేదాల నేపథ్యంలో శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమృతసర్ ఎమ్మెల్యే నవ్‌జోత్ సింగ్ సిద్ధూని తప్పుదారి పట్టించే క్షపణిగా అభివర్ణించారు. సిద్ధూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాను కలిసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమృతసర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిద్ధూ ఎవరితోనూ కలవడు. ఆయన బీజేపీలో చేరినప్పుడు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత సిద్ధూ ఆ పార్టీ నేతలను ‘దొంగలు’ అన్నారు. సిద్ధూ తప్పుదారి పట్టించే క్షిపణి. దానికి నియంత్రణ ఉండదు. అది ఏ దిశలోనైనా వెళ్లి ఎక్కడైనా తగలొచ్చు. ఒకవేళ అది సిద్ధూనే కొట్టినా ఆశ్చర్యం లేదన్నారు. అయితే ఇటు సిద్ధు సైతం బాదల్ బ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అవును మీ అవినీతి కార్యకలాపాలను నాశనం చేయడానికి నిర్దేశించిన మిసైల్‌ని అంటూ సెటైర్ వేశారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.